
SI Warns Farmers on Land Frauds
భూమి కొనుగోలులో మోసాలపై ఎస్సై హెచ్చరిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో, ఝరాసంగం మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్ శుక్రవారం ఒక ప్రకటనలో భూమి కొనుగోలులో జరుగుతున్న మోసాలపై రైతులకు హెచ్చరిక జారీ చేశారు. కొంతమంది బ్రోకర్లు తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని నమ్మించి, అసలు భూమి కాకుండా వేరే భూముల పట్టా పాస్బుక్లు చూపించి మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రాజెక్టులలో మునిగిపోయే భూములను కూడా రోడ్డు పక్కన ఉన్న భూములుగా చిత్రీకరించి అమ్ముతున్నారని, అగ్రిమెంట్ల పేరుతో రైతుల నుండి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన వివరించారు.గతంలో ఎన్నో గ్రామాలలో ఇలాంటి మోసాలపై కేసులు నమోదయ్యాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.