
`పీఏ చెబితే ఎమ్మెల్యే చెప్పినట్లే!(నా)!?
`మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పీఏ ఇష్టారాజ్యం
`మంచిర్యాల ఎమ్మెల్యే పేరు చెడగొడుతున్న పీఏ
`ఎమ్మెల్యేకు సమాచారం లేకుండానే పనులు కానిస్తున్న పీఏ
`మంచిర్యాల నియోజకవర్గంలో పెత్తనమంతా పీఏదే!
`నియోజకవర్గ పనులన్నీ పీఏ కనుసన్నల్లోనే..
`పీఎ ఎస్ అంటే ఎస్..నో అంటే నో..
`పీఏ అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.
`వద్దంటే కాంట్రాక్టులు వదులుకోవాల్సిందే.
`ఎమ్మెల్యే అనారోగ్య కారణాల వల్ల నియోజకవర్గానికి రావడం లేదు.
`ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసేందుకు పీఏ ఎవరికీ అవకాశమివ్వడం లేదు.
`అధికారులను గుప్పిట్లో పెట్టుకొని కాంట్రాక్టర్లను వేధిస్తున్నాడు
`అర్హులైన కాంట్రాక్టర్లను పక్కన పెడుతున్నాడు
`అధికారుల సహకారంతో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు
`లోకల్‌ల్లో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లేని వారికి టెండర్లు అప్పగిస్తున్నారు
`స్థానిక కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు
`అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నాడు
`అంతా నా ఇష్టమన్నట్లు వ్యవహరిస్తున్నాడు
`ఇప్పటికైనా ఎమ్మెల్యే నిజాలు తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
`అవినీతిలో మునిగితేలుతున్న పిఏను పక్కన పెట్టకపోతే నష్టం జరిగిపోతుందంటున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏ నియోజకవర్గంలోనైనా సరే ఎమ్మెల్యేలు చెబితే పనులౌతాయి. మంచిర్యాల జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దగ్గర పనిచేసే పిఏ చెప్పిన పనులే అవుతాయి. పిఏ చెప్పినట్లే జరుగుతాయి. ఇక్కడ పిఏ చెప్పిందే ఫైనల్..అలా అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు ఆదేశాలతో జరిగిపోతున్నాయా? అంటే అదీ లేదు. అసలు ఎమ్మెల్యేకు ఈ విషయాలే తెలియవు. అంతగా పిఏ. ఏదిచెబితే ఎమ్మెల్యే అది చెప్పినట్లే అన్నట్లుగా సాగుతోంది. ఇలా రాష్ట్రంలోనే కాదు, నియోకవర్గంలోఎంతో పేరున్న ఎమ్మెల్యే పేరు చెడిపోవడానికి ఇలాంటి పిఏ ఒక్కరుంటే చాలు అని పార్టీ నాయకులు , ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నమ్మారు. పిఏ ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదే మంచిర్యాలలో అందరూ అనుకుంటున్న మాట. ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకుఎంతో మంచి పేరుంది. కాని ఏం లాభం. ఆయన పెట్టుకున్న పిఏ వల్ల తన రాజకీయ జీవితానికి ఇబ్బందులు తలెత్తుతాయని అనుకోలేదు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేకు చెప్పడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. నాయకులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే తన వద్ద పని చేసే పిఏను అంతగా నమ్ముతున్నారు. అందుకే నియోజకవర్గ నాయకులు కూడా ఎవరూ పిఏ మీద పిర్యాధు చేయడానికి సాహసించడం లేదు. పైగా పిఏతో సఖ్యతగా వుంటే చాలనుకుంటున్నారు. కాని ప్రజలకు మేలు చేయాలన్నా,సేవ చేయాలన్నా, అభివృద్ది పనుల చేపట్టాలన్నా తామే ముఖ్యమన్న సంగతి నాయకులు కూడా మర్చిపోతున్నారు. పిఏ చెప్పినట్లు తలాడిస్తున్నారు. ఒక రకంగా వారికి కూడా తప్పడం లేదు. ఎంతోమంది ప్రజల మన్ననలు పొంది నాయకులైన వాళ్లు కూడా పిఏ. మన్ననలు పొందాలనుకుంటున్నారు. ఇది ఒక రకంగా పార్టీ నాయకులకు దౌర్భాగ్యమైన పరిస్తితే. కాని ఏం లాభం? నోరు తెరిచి ప్రశ్నించలేరు. తమ ముందు పిఏ ఎంత అని అనుకోలేరు. ఎమ్మెల్యేకు చెప్పిన ఆయన పట్టించుకుంటాడో లేదో అన్న అనుమానం. ఎమ్మెల్యేకు ఎప్పుడూ సమాచారమందించే పిఏతో పెట్టుకొని పేరు చెడగొట్టుకోవడం ఎందుకు? ఎమ్మెల్యేకు దూరం కావడమెందుకు? అనే ధోరణిలోనే నాయకులు సాగుతున్నారు. దాంతో ఆ పిఏ ఆడిరది ఆట.. పాడిరది పాటగా మారిపోయింది. ఎలాంటి విషయాల్లోనైనా సరే పిఏ. ఎస్ అంటే ఎస్. నో.అంటే నో..అంతే! అంతకు మించి దారి లేదు. పరిష్కారం అంతకాన్న లేదు. అంతగా పిఏ ఏలుబడి సాగుతోంది. నిజమే పిఏ పలుకుబడి మంచి పనుల విషయంలోనో, ప్రజలకు మేలు జరిగే విషయంలో సాగితే బాగుంటుంది. కాని తన ఇష్టానుసారం పిఏ సాగిస్తున్న తీరు మాత్రం అందరికీ ఇబ్బందికరంగా మారుతోంది. నాయకులే ఎమ్మెల్యే పిఏ ముందు పెద్దగా నోరు విప్పకపోవడంతో అధికారులు కూడా పిఏకు వంత పాడుతున్నారు. పిఏ చెప్పిందే చేస్తున్నారు. పిఏ ఏది చెబితే అదే చేస్తున్నారు. ఇలా అధికారులు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తున్నారు? ఆఖరుకు కోర్టు తీర్పులను కూడా పక్కన పెడుతున్నారు. అభివృద్ది పనులను చేపట్టే కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారు. జిల్లా అదికార గణం నుంచి మొదలు, నియోకవర్గ, ముస్సిపల్ అదికారులంతా పిఏ చెప్పినట్లు వినాలి. పిఏ చెప్పిన వారికే కాంట్రాక్టులివ్వాలి. అర్హత లేని వాళ్లైనా సరే పిఏ చెప్పి వారికే టెండర్లు అప్పగించారు. ఇలాంటి ఏ విషయంలోనూ ఎమ్మెల్యేకు సమాచారం వుండడంలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. తమను ఎమ్మెల్యే వద్దకు వెళ్లకుండా చేస్తున్నాడని వాపోతున్నారు. నియజక వర్గ పెత్తనమంతా తన గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలకు తెరతీస్తున్నాడు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు అనార్యో కారణంగా నియోజకవర్గానికి రావడం లేదు. అది అలుసుగా తీసుకొని పిఏ రెచ్చిపోతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎమ్మెల్యేను కలవాలని ఎంత ప్రయత్నించినా పిఏ. ఆ అవకాశం కల్పించడం లేదు. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు వెళ్లినా అప్పాయింటు మెంటు దొరక్కుండా పిఏ చూసుకుంటున్నాడు. దాంతో ఎమ్మెల్యే వద్దకు వెళ్లలేక, పిఏ చేస్తున్న పనులు భరించలేక కాంట్రాక్టర్లు సతమతమౌతున్నారని సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే అదికారులను గుప్పిట్లో పెట్టుకొని స్ధానిక కాంట్రాక్టర్లను పిఏ వేధిస్తున్నాడని తెలుస్తోంది. అర్హులైన , లోకల్ కాంట్రాక్టర్లను పక్కన పెట్టి, ఎక్కడి నుంచో వచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు. నియోజకవర్గ పరిదిలో ఏ పనులు చేయాలన్నా, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ వుండాలి. అది స్దానికంగా వుండాలి. కనీసం నియోజకవర్గానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే వుండాలి. ఇది నిబంధనలు చెబుతున్నాయి. స్ధానికంగా వున్న కాంట్రాక్టర్లందరికీ మంచిర్యాలలోనే క్యాలిటీ కంట్రోల్ ల్యాబులున్నాయి. కాని వారికి మాత్రం కాంట్రాక్టులు అందడం లేదు. ఎక్కడి నుంచో వచ్చే ధర్డ్ పార్టీలకే టెండర్లు, కాంట్రాక్టులు వెళ్తున్నాయి. అలా అదికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పిఏ తన ఇష్టారాజ్యం సాగిస్తున్నారు. స్ధానికంగా క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లేకపోవడం వల్ల జరుగుతున్న పనులు నాణ్యతను కూడా పట్టించుకునేవారు లేకుండాపోయారు. స్ధానికంగానే క్వాలిటీ కంట్రోల్ ల్యాబులున్న కాంట్రాక్టర్లు పనికిరాకుండాపోతున్నారు. కాంట్రాక్టులు దక్కించుకోలేకపోతున్నారు. ఇలా గత ఏడాది ఇచ్చిన కాంట్రాక్టులపై కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. అయినా అదికారులు ఆ తీర్పుకు అనుగుణంగా కాంట్రాక్టులు ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా రద్దు చేసి మరీ కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నారు. పిఏకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పిఏ తన స్వార్ధం కోసం అదికారులను గుప్పిట్లో పెట్టుకొని నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకున్న పేరును చెడగొడుతున్నారు. అంతా నా ఇష్టమన్న రీతిలో పిఏ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. లేకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. పిఏ చేస్తున్న అవినీతి అక్రమాలన్నీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావుకు తెలిసే జరుగుతున్నాయని ప్రజలు అనుకునే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్యే మద్దతు లేకుండానే పిఏ ఇంత ఇష్టాను సారం వ్యవహరిస్తారా? అని అనుమానపడే పరిస్ధితి వస్తుంది. ఇంకా మూడేళ్ల కాలం వుంది. మళ్లీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రజలకు సేవ చేయాల్సి వుంది. ఇలాంటి సమయంలో పిఏ ఆగడాలను ఎమ్మెల్యే ఉపేక్షిస్తూపోతే ప్రజల్లో నమ్మకం పోయే పరిసి ్దతి రావొచ్చు. ప్రేమ్‌సాగర్‌రావు మంచితనం చాలా మందికి తెలిసినా, కొంత మందికి తెలియకపోవచ్చు. ఎన్నికల నాటికి పరిస్ధితి చేయిదాటి పోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి వచ్చినా, రాకపోయినా ఇప్పటికైనా మేలుకుంటే ఎంతోమంచిదని ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే మీద ఎలాంటి వ్యతిరేకత ఇప్పటి వరకు లేదు. కాని పిఏ వల్ల ఆ వ్యతిరేకత మొదలౌతే చేయని తప్పుకు శిక్ష అనుభవించినట్లౌవుతుంది. పిఏల వ్యవహార శైలి వల్ల గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. అలాంటి పరిస్దితి రాకుండా వుండాలంటే వెంటనే ఎమ్మెల్యే పరిస్ధితులను చక్కదిద్దుకుంటేనే రాజకీయ భవిష్యత్తు వుంటుందని ప్రేమ్‌సాగర్‌రావు శ్రేయోభిలాషులు చెబుతున్నారు.