
"Felicitation to Award-Winning Teacher Bhoomeshwar"
జిల్లాస్థాయి లో అవార్డు స్వీకరించిన భూమేశ్వర్ కు ఘన సన్మానం.
మల్లాపూర్ సెప్టెంబర్ 12 నేటి దాత్రి
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న భూమేశ్వర్ ఉపాధ్యాయుడు ఇటీవలే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఘన సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని విలువలను వినయాన్ని నేర్పుతూ ప్రజల మనసును చూరగొన్న భూమేశ్వర్ నిజంగా అభినందనీయుడని అవార్డుకు తగిన వ్యక్తిగా సరిపోతాడని ఈ అవార్డు మరింత బాధ్యత పెంచుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు కైవసం చేసుకొని మా పాఠశాలకు పేరు తీసుకురావాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయి, విష్ణువర్ధన్ రాజు శ్రీధర్ గౌడ్ కొండ గణేష్ దువ్వ నవీన్ నాగభూషణం మహేష్ రమణ ముజాబీర్ మెలికూర్ రెడ్డి వందన తదితరులు పాల్గొన్నారు.