
Subsidy Fish Seeds
సబ్సిడీ చేప పిల్లల రాకపోవడంపై ప్రభుత్వం పట్ల అసంతృప్తి
ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు
ఆకుల సుభాష్ ముదిరాజ్.
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం రాష్ట్రము అంతటా చెరువులు కుంటలు రిజర్వాయిర్ ప్రాజెక్ట్ లు నిండు కుండల ఉండి మత్తళ్ళు దునుకుతుంటే. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చేప పిల్లలు రాక చేపల వృత్తే జీవనధారంగా కొన్ని లక్షల మంది మత్స్య కారులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఎన్నికలముందు వారు ఇచ్చిన హామీలు నమ్మి ప్రతి మత్స్య కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి అని ఒక్కవైపుగా మద్దతూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయినా మాట అందరికి తెలిసిందే. కానీ గత సంవత్సరం అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయి నాసి రకం చేప పిల్లలు పోయాడంతో పాటు కేటాయించిన చేప పిల్లలు పోయాక దొంగ లెక్కలు చూపి మత్స్యకారులను దగాచేసినారు ఈ సంవత్సరం జులై మాసం లొ పొసే సబ్సిడీ పిల్లలు సెప్టెంబర్ మాసం వచ్చినప్పటికి ప్రభుత్వం ఇవ్వకపోవడం మత్స్యకారులు ప్రభుత్వం పై కన్నెర్ర చేయడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలపడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి జీవనధారం కోల్పోయిన మత్స్య కారులకు. భృతి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.