
Health Awareness Drive in Mogullapalli
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
మొగుళ్లపళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మండల వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాలలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ఏ.ఎన్.ఎం .ఆశా వర్కర్లు చేయడం జరిగినది. అదేవిధంగా ఇసి పేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో 55 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి ఇద్దరికీ రక్త నమూనాలు తీసి ల్యాబ్ కు పంపించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ మండలంలో వర్షాలు అధికంగా పడటం వల్ల ,సీజన్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం లలో డ్రైడే కార్యక్రమాన్ని అనగా ఇంట్లో ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకొని వాటిని డ్రై చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా, పుట్టకుండా జాగ్రత్తలు వహించాలని ,జ్వరం వచ్చినట్లయితే మా వైద సిబ్బందికి తెలియజేయాలని మండల ప్రజలకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సి .హెచ్ .ఓ. రాజేంద్రప్రసాద్ ,హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ,అన్ని గ్రామాల ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సెక్రటరీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.