
SFI Pays Tribute to Yechury in Sircilla
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి వర్ధంతి
రాష్ట్రంలో విద్య,ఉపాధి అవకాశాలు కోసం ఏచూరి ఆదర్శంగా పోరాడాలి
ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ పూర్వజాతీయ అధ్యక్షులు జేఎన్ యు విద్యార్థి సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి ఆశయ సాధన కోసం నేటి విద్యార్థులు ముందుకు సాగాలని అన్నారు
అధ్యయనం, పోరాటం స్ఫూర్తితో సెక్యులర్ విధానం కోసం ఉద్యమించాలని విద్యను , విద్యరంగంలో ఫాసిస్ట్ ఫాలసీలను అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కోసం విద్యలో అసమానతలు కోసం ఏచూరి స్ఫూర్తితో ఉద్యమాలు కోనసాగించాలని అన్నారు.
విద్యార్ధి హక్కులకోసం నిఖరంగా నిలబడి ఏమర్జెన్సీలో సైతం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ని రాజీనామా చేయాలని అడిగిన ధీశాలి సీతారాం ఏచూరి అని అన్నారు. విద్యార్ధులలో ఆకర్షణీయమైన నినాదాలు రూపోందించి, పోరాటాలకు విద్యార్ధులను కదిలించిన యోధుడని తెలిపారు. ఆయన స్ఫూర్తితో ప్రజాస్వామ్య హక్కులు కోసం, విద్యారంగ హక్కులకోసం ఉద్యమించాలని తెలిపారు.విద్యార్థులకు పెండింగ్స్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలను పెంచి బకాయిలను విడుదల చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ నాయకులు ముబారక్, సాయి, రషీద్, జశ్వంత్, నవీన్, నయీం, సాయి భరత్ తదితరులు పాల్గొన్నారు