
Bull Dies in Lightning Strike
పిడుగుపాటుకు ఎద్దు మృత్యువాత
నడికూడ,నేటిధాత్రి:
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
మండలంలోని కౌకొండ గ్రామంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపుల వర్షంతో పిడుగు పడి ఓ ఎద్దు మృత్యువాత పడింది,మరో ఎద్దు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి,కౌకొండ గ్రామానికి చెందిన రైతు ఓదెల భాస్కర్ తన రెండు ఎడ్లను వర్షం కురుస్తుందని రాత్రి సమయంలో పశువులకు మేత వేసి పాకలో కట్టేశారు, ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది, ఉరుముల మెరుపులతో పెద్ద శబ్దంతో ఎడ్ల సమీపంలో పిడుగు పడింది.ఈ ప్రమాదంలో ఒక ఎద్దు అక్కడికక్కడే మృత్యువాత పడింది, మరో ఎద్దు తృటిలో ప్రాణాపాయం తప్పింది.కాగా మృత్యు వాద పడిన ఎద్దు విలువ రూ.95వేలు ఉంటుందని మాజీ సర్పంచ్ అల్లె శ్రీను తెలిపారు. పేద కుటుంబానికి చెందిన రైతు భాస్కర్ ను ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు.