
Tarpaulin aid for rain-hit family in Jhansi Lingapur
ఝాన్సీ లింగాపూర్‌లో టార్ప్లిన్ పంపిణీ..
వర్షంలో ఇల్లు కూలి ఇబ్బందులు..
రామాయంపేట సెప్టెంబర్ 12 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన తుడుం జీవన్ కుమార్ కుటుంబం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిన్న రాత్రి మరోసారి వర్షం కురవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇది తెలుసుకున్న
సానీక్ష ఫౌండేషన్ ముందడుగు
పేద కుటుంబం పరిస్థితిని గమనించిన సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివ తక్షణమే స్పందించారు. కుటుంబ అవసరాలపై స్థానికులు సమాచారం అందించగా, శివ స్వయంగా ముందుకు వచ్చి సహాయం కల్పించే ప్రయత్నం ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన దాతలు రాజశేఖర్ రెడ్డి, మేఘన నండూరి (ఇక్షణ ఫౌండేషన్) సానుభూతితో స్పందించారు. వారి సహకారంతో శుక్రవారం టార్ప్లిన్ పంపిణీ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివతో పాటు కాంగ్రెస్ యువ నాయకుడు నవీన్ రెడ్డి, సభ్యులు శ్రీకాంత్, బాధితుడు తుడుం జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ సహాయం పేదలకు నిజమైన అండగా నిలుస్తుంది. ఇలాంటి సమయంలో దాతలు ముందుకు రావడం అభినందనీయం అని తెలిపారు.