
-మంది మాటలు నమ్మితె..ఎనుకటి కాలం ముందటికొచ్చే!
-రైతు బంధు కేసిఆర్ ఇంట్లకేలి ఇస్తుండా అంటే నమ్మితిరి!
-పదికి ఐదు కలిపి ఇస్తామంటే గంతేస్తిరి
-కాళేశ్వరం కేసిఆర్ జేబుల పైసలా అంటే జేజేలు కొడితిరి
-యాభై ఏండ్లలో నీళ్లియ్యనోళ్లను నమ్మితిరి
అబద్దాలు చెప్పీ, చెప్పి ప్రజలను కాంగ్రెస్ నాయకులు నమ్మించి, వంచించారు. సంతోషంగా కేసిఆర్ పాలనలో కడుపు చల్లగా బతుకిన, రైతుల నోట్లో కాంగ్రెస్ పాలకులు మట్టికొడుతున్నారు. నీళ్లియ్యలేరు. కరంటు ఇయ్యలేరు. ఎరువులియ్యలేరు. వడ్లు కొనలేరు. రైతును బతకనీయరు. యాభై ఏండ్లు పుచ్చుకున్న గోస చాలదని, అధికారంలోకి వచ్చి రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ ప్రజలు, రైతులు ఇంక జన్మల కాంగ్రెస్ ను నమ్మరు. కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజల్లోకి రావాలంటే సిగ్గు పడుతున్నరు. భయపడుతున్నరు. అంటున్న మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చల్లా ధర్మారెడ్డి, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు’’ తో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే…
-పదేళ్లలో అరవై ఏళ్ల గోస తీర్చినా కేసిఆర్ ను ఒద్దనుకుంటిరి
-ఆరునెలలల్ల ఇరవై నాలుగు గంటల కరంటిచ్చిడు గొప్పేనా అంటే ఓట్లేస్తిరి
-అవద్దాలు చెప్పినోళ్ల మాటింటిరి
-కండ్ల ముందుకు కష్టం రాకుంట సూశిన కేసిఆర్ ను దింపితిరి
-కోరికోరి కొరివితో తలగోక్కుంటిరి
-ఎండిపోయిన బావుల్ల నీళ్లొచ్చినా మర్చిపోతిరి
-బతకపోయి, మళ్లోచ్చి బతుకు బంగారమైనా నియ్యత్ తప్పితిరి
-మోసం చేసినోళ్లనే నమ్మితిరి..నరకం సూడవడితిరి
-తీరిన గోస తిరిగొచ్చే..
-ఎరువు కరువు మళ్లోచ్చే…
-చెప్పుల లైన్లు మళ్ల కనిపించే..
-బస్తా కోసం కొట్టుకోవాల్సి రావట్టే..
-ఎరువు లేక పంట ఏడ్వవట్టే..
-పంట చేతికెలా వస్తుందని రైతు కంటతడిపెట్టే
-కాలమైనా నీళ్లు లేవాయే..
-కాళేశ్వరం నీళ్లు ఉత్తగ పోవట్టే
-నమ్మితే బతుకులు ఆగంకావట్టే!
అబద్దాలు చెప్పి చెప్పి ప్రజలను కాంగ్రెస్ నాయకులు నమ్మించి వంచించారు. సంతోషంగా కేసిఆర్ పాలనలో కడుపు చల్లగా బతికిన రైతుల నోట్లో కాంగ్రెస్ పాలకులు మట్టి కొడుతున్నారు. నీళ్లియ్యలేరు. కరంటియ్యలేరు. ఎరువులియ్యలేరు. పూర్తి స్ధాయిలో వడ్లు కొనలేరు. రైతును బతకనీయలేరు. యాభై ఏండ్లు పుచ్చుకున్న గోస చాలలేదని తెలంగాణ ప్రజలను నమ్మించి, అలవి కాని హమీలిచ్చి, ఒక్క అవకాశమివ్వండని కోరి అధికారంలోకి వచ్చి మళ్లీ ప్రజలను రాచి రంపాన పెడుతున్నారు. పాలన చేతగా రైతులను అరి గోసకు గురి చేస్తున్నారు. కనీసం ఎరువులు కూడా సకాలంలో సరఫరా చేసేదిక్కులేదు. మరో వైపు అన్ని వర్గాలను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇంక జన్మలో ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు. కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి రావాలంటే కూడా జంకుతున్నారు. భయపడుతున్నారు. ప్రజలకు ముఖం చూపడం లేదు. పల్లెల్లోకి వస్తే ప్రజలే కాంగ్రెస్ నాయకులను తన్ని తరమిస్తారని భయపడుతున్నారంటునన్న మాజీ ఎమ్మెల్యే , బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చల్లా దర్మారెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే….
చరిత్రలో ప్రజలను మోసూం చేసిన పాలకులు వున్నారు. ప్రభుత్వాలున్నాయి. ప్రజలకు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిన పాలకులున్నారు. ఇచ్చిన హమీలను కనీసం గుర్తు చేయలేకుండా పాలించిన వారున్నారు. ఏం హమీలిచ్చారో కూడా తెలియని పాలకులున్నారు. ప్రజలను మోసం చేసిన, అదికారం కోసం అలవి కాని హమీలు ఇచ్చిన పాలకులను చూస్తున్నాం. కాని ప్రజలు ఒక నాయకుడిని మోసం చేసిన సందర్భం కూడా తెలంగాణలో చూశాం. అరవై సంవత్సరాలుగా ప్రజలు అనుభవిస్తున్న గోసను చూడలేక, ప్రత్యేక రాష్ట్రం సాధన తప్ప తెలంగాణ ప్రజలకు విముక్తి లేదని జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కేసిఆర్. పద్నాలుగు సంవత్సరాల పాటు సుధీర్ఘమైన అలుపెరగని పోరాటం చేసి, కేందర్ర మెడలు వంచి తెలంగాణను సాధించిన ధీరుడు కేసిఆర్. తెలంగాణ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ది చేసుకోవాలో కూడా ఉద్యమ కాలం నాడే బ్లూ ప్రింట్ తయారు చేసిన ఉద్యమ కారుడు కేసిఆర్. తెలంగాణ తెచ్చి తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో రూపొంచిందించిన బ్లూ ప్రింట్‌ను పదేళ్ల కాలంలో అమలు చేసి బంగారుతెలంగాణను తయారు చేసిన పాలకుడు కేసిఆర్. దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఒక రాష్ట్రాన్ని ఇంత వేగంగా అభివృద్ది చేసిన పాలకుడు ప్రపంచంలో ఒక్క కేసిఆర్ తప్ప మరొకరు లేరు. ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా వున్న తెలంగాణను బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఎస్ఆర్సీ స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల జీవితాలను ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. తెలుగు మాట్లాడే ప్రాంతమంతా కలుపుతున్నామని చెప్పి, బాష ఒకటైనా యాసలో, వేషదారణలో, సంస్కృతీ సంప్రదాయాలలో ఏ మాత్రం సంబంధం లేని రెండు ప్రాంతాలను కలిపి 1956లో కాంగ్రెస్ పార్టీ దిద్దుకోలేని తప్పు చేసింది. తెలంగాణ పాలిట మరణ శాసనం రాసింది. అలా 1956లో మొదలైన గోస తెలంగాణ ప్రజలు 2014 వరకు అనుభవించారు. అరిగోస పడ్డారు. ఆకలికి ఏడ్చారు. బతుకు దెరువుకు ఏడ్చారు. ఆత్మగౌరవం కోసం తపించారు. ఆత్మాభిమానం లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ పౌరులుగా బతికారు. బతకలేక వలసలు పోయారు. వున్న ఊరును,కన్నతల్లిని వదిలి పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. ఇలా బతుదెరువు కోసం వలసలు వెళ్లారు. తెలంగాణను అన్ని రంగాల్లో ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. అభివృద్దిని అలక్ష్యం చేశారు. తెలంగాణ ప్రగతిని పక్కన పెట్టారు. తెలంగాణ అంటేనే ఉమ్మడి పాలకులు మండిపడ్డారు. తెలంగాణకు సాగు నీరివ్వలేదు. సరిగ్గా కరంటు ఇవ్వలేదు. సాగుకు ఇచ్చే కరంటు చార్జీలు విపరీతంగా పెంచారు. రైతులు బోర్లు వేసుకునేందుకు అవకాశమివ్వలేదు. వాల్టా చట్టం తెచ్చి రైతులపై కేసులు నమోదు చేశారు. జైలు పాలు చేశారు. తెలంగాణ రైతాంగాన్ని ఎంత హింసించాలో అంత హింసించారు. మొత్తంగా తెలంగాణలో సాగు లేకుండా చేశారు. సాగు పడావు పడేలా చేశారు. తెలంగాణ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేశారు. తెలంగాణ ప్రజలకు తెలివి లేదన్నారు. పాలించడం చేత కదన్నారు. నాయకత్వ లక్షణాలు లేవన్నారు. ఉమ్మడి పాలకుల చెప్పినట్లు వినే ఉత్సవిగ్రహాలు మార్చారు. తెలంగాణ అంటే వెనుబడిన ప్రాంతంగా మార్చారు. చెరువులు ద్వంసం చేశారు. ప్రాజెక్టులు కట్టలేదు. కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. నల్లగొండ లాంటి జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే చూశారు. చిన్న వయసులోనే ప్రాణాలు పోతుంటే కనికరం చూపలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని చేశారు. అలాంటి తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన సాధించిన పోరాట యేధుడు కేసిఆర్. తెచ్చిన తెలంగాణలో బతుకు విలువ పెంచారు. తెలంగాణ బతుకు దేశానికే ఆదర్శం చేశారు. ఏ తెలంగాణలో అయితే తొండలు గుడ్లు కూడా పెట్టవని ఎగతాళి చేశారో అదే తెలంగాణలో బంగారు పంటలు పండేలా చేశారు. బంగారు తెలంగాణ తయారు చేశారు. సాగు, తాగు నీటి సమస్య తీర్చారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని సాగు అద్భుతాలు సృష్టించారు. కాళేశ్వరం లాంటి గొప్ప సాగునీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఐదేళ్లలో చింతలు లేని తెలంగాణ తయారు చేశారు. పదేళ్లలో బంగారు తెలంగాణ తయారుచేశారు. ఒకప్పుడు మెతుకు కోసం ఆరాటపడిన తెలంగాణను దేశానికి అన్న పూర్ణను చేశారు. చుక్క చుక్క ఒడిసిపట్టి తెలంగాణకు మళ్లించాడు. ఎండిన వాగులు పారించారు. ఎండా కాలంలో చెరువులు మత్తలు దుంకించాడు. ఎండిపోయిన బావును మళ్లీ కళకళలాడేలా చేశారు. ఇవన్నీ ప్రజలు కళ్లారా చూశారు. ఉమ్మడిరాష్ట్రంలో కాంగ్రెస్ దుష్ట రాక్షస పాలన చూశారు. తెలంగాణ తెచ్చిన కేసిఆర్ బంగారు పాలన చూశారు. ఒకప్పుడు చీకటి బతుకులు చూసిన తెలంగాణకు వెలుగులు తెచ్చిన కేసిఆర్ పాలన చూశారు. ఎకరాల కొద్ది భూములున్నా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన రైతులున్నారు. ఆటోలు నడుపుకున్నారు. హోటళ్లలో సర్వర్లుగా పనిచేశారు. ఏ చేతితో బంగారు పంటలు పండిరచారో అదే చేతితో, రాళ్లు కొట్టారు. ఎంగిలి ప్లేట్లు కడిగారు. ఇలా తెలంగాణ రైతులు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ మరిపించిన కేసిఆర్ పాలన చూశారు. కాలు మీద కాలేసుకొని సాగు చేసుకునేలా రైతుకు అన్ని సౌకర్యాలు కల్పించారు. పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చాడు. పండిన పంటలను కల్లం నుంచే నేరుగా కొనుగోలు చేశారు. రెండు మూడు రోజుల్లో రైతుల అక్కౌంట్లలో డబ్బులు పడేలా చేశారు. ఇన్ని చేసిన కేసిఆర్‌ను కాదుకొని కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించుకున్నారు. కేసిఆర్ పాలనలో చీకు చింత లేని జీవితాలు అనుభవించారు. కాంగ్రెస్‌ను గెలిపించుకొని మళ్లీ చింతలు కొని తెచ్చుకున్నారు. విద్య, వైద్యం లేకుండా చేశారు. ఏ ప్రజలు పాలించమని నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజలనే ఇబ్బందుల పాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అనాదిగా అలవాటే. కేసిఆర్ రైతు బంధు ఇస్తే ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? మేం అదికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ప్రజలను నమ్మించారు. ఏమైంది? ఆనాడు కేసిఆర్ చెప్పినట్లే రైతు బంధుకు రాం..రాం అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజల మేలు కోరి కేసిఆర్ ఎన్నో సార్లు చెప్పారు. నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయన్నారు. కరంటు కటకట మొదలౌతుందని కేసిఆర్ చెప్పి చూశారు. కాని కాంగ్రెస్ మాటలు ప్రజలు నమ్మారు. ఇప్పుడు బాధపడుతున్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే ఆగం చేస్తుందని కేసిఆర్ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినలేదు. అలా ప్రజలను మాయ చేసిన కాంగ్రెస్ నాయకులు అధికారం తప్ప ప్రజా సేవను గాలికి వదిలేశారు. కాంగ్రెస్ పాలన అంటేనే రాక్షస రాజ్యమని మరోసారి తేలిపోయింది. తెలంగాణ అంతా మళ్లీ కేసిఆర్ జపం మొదలైంది. సారే రావాలని కోరుకుంటున్నారు. ఇక వచ్చేదంతా బిఆర్ఎస్ కాలమే. తెలంగాణ రైతులకు పండుగ రోజులు మళ్లీ కేసిఆర్ పాలనలోనే..