
Chakali Ailamma 40th Birth Anniversary Tribute in Mariped
చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి
మరిపెడ నేటిధాత్రి
తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశేషమైనదని, ఆమె మహిళా చైతన్యం, శక్తికి ప్రతీక అని మరి పెడ ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్థంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపిడిఓ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపారని ఈ సందర్భంగా అన్నారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ఎంపీఓ సోములాల్ నాయక్,ఏపీఓ భీమా నాయక్, పంచాయతీ కార్యదర్శి లెనిన్, టెక్నికల్ అసిస్టెంట్ నెహ్రూ, ధర్మయ్య ఎల్లమ్మ, జూనియర్ అసిస్టెంట్ సౌజన్య పంచాయతీ కార్యదర్శిలు లతా,ప్రియదర్శిని,సరిత, విజయ కుమారి,నజియా తదితరులు పాల్గొన్నారు.