
"Hostel Issues Raised in Ramayampet"
సమీకృత హాస్టల్ ఆవరణలో ఆవరిగోడ నిర్మాణం చేపట్టాలి
ఎస్సి గర్ల్స్ హాస్టల్ కొత్త భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కృషి చేయాలి
హాస్టళ్లను పర్యవేక్షణ చేసిన యు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటి సభ్యుడు రవి..
రామాయంపేట సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణ కేంద్రంలో ఉన్న పలు హాస్టళ్లను జిల్లా అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గుడికందుల రవి పర్యవేక్షణ చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని రవి మాట్లాడుతూ…. సమీకృత హాస్టల్ ఆవరణలో అవరి గోడ లేకపోవడం వల్ల బయట వ్యక్తులు హాస్టల్లోకి వెళ్లి బాత్రూం లు నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు.
సిగరెట్ల డబ్బాలు, అంబర్ వంటి పొట్లాలు మైదానంలో పడేసి వెళుతున్నారని అన్నారు కావునా అధికారులు అవరిగోడ నిర్మించాలని ఆయన కోరారు ఎస్సీ గర్ల్స్ హాస్టల్ సమస్యలు పరిష్కరించే నాథుడే కరువయ్యాడనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శిధిల వ్యవస్థకు చేరిన హాస్టల్ కొత్త భవనం నిర్మించే దిశగా స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని ఆయన అన్నారు పట్టణ కేంద్రంలో ఇంటర్మీడియట్ డిగ్రీ అబ్బాయిలు హాస్టల్లో ఉందామంటే వారికి హాస్టల్ సదుపాయం లేక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేద వ్యక్తం చేశారు గురుకుల హాస్టల్ సదుపాయాలకు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని ఆయన తెలియజేశారు కేజీబీవీ హాస్టల్లో నీటి కొరత తీర్చాలని. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ హాస్టల్లో అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని వారి సమస్యలు పరిష్కరించాలనీ అన్నారు జిల్లా కలెక్టర్ లాగా ప్రతి విద్యాధికారులు పర్యవేక్షణలో ఉండాలని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యు ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శేఖర్ నాయకులు మహేష్ పాల్గొన్నారు