
Challa Dharmareddy Birthday Celebrations in Parakala
పరకాల అభివృద్ధి ప్రధాత చల్లా కు జన్మదిన శుభాకాంక్షలు
16వ డివిజన్ లో చల్లా జన్మదిన వేడుక నిర్వహించిన స్థానిక కార్పొరేటర్.
కాశిబుగ్గ నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం లో పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గా నిరంతరం కృషి చేశారని,వారి పట్టుదలతో మండలానికి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు వచ్చిందని,డివిజన్ వ్యాప్తంగా ధర్మారెడ్డి కృషితోనే అభివృద్ధి జరిగిందని,పరకాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న చల్లా ధర్మారెడ్డి రాబోయే రోజుల్లో మళ్ళీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరకాల ప్రజలకు సేవ చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ గోలి రాజయ్య,డివిజన్,గ్రామ అధ్యక్ష కార్యదర్శులు,బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు..