
Grand Birthday Celebrations of Challa Dharmareddy in Nadikuda
ఘనంగా చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు
నడికూడ,నేటిధాత్రి:
పరకాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి జన్మదిన సందర్భంగా నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేక్ కట్ చేసి,పండ్ల పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దురిశెట్టి చంద్రమౌళి(చందు) మాట్లడుతూ పరకాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృధి చేసిన నాయకుడు,బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, నాయకుడన్న పదానికి నిలువెత్తు రూపం,నేటి యువతరానికి ఆదర్శం, రాజకీయాల్లో మచ్చ లేని జనహృదయ నేత అని, కార్యకర్త కి అపద అంటే నేను ఉన్నా అంటూ అండగా ఉండే నాయకుడు అని కొనియాడారు ఈ సందర్భంగా నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ తరుపున మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ అష్ట ఐశ్వర్యాల తో ఉండాలని ప్రార్ధించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు నందికొండ జైపాల్ రెడ్డి,మచ్చ రవీందర్, సుధాటి వెంకటేశ్వర్ రావు, నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు,మండల అధికార ప్రతినిధి లింగాల తిరుపతి,రావుల కిషన్, మండల యూత్ నాయకులు ముస్కే రాము,గుడికందుల శివ,దురిశెట్టి వెంకటేశ్,తిప్పర్తి ప్రశాంత్ రెడ్డి,బియ్యాల ప్రశాంత్ రావు,కౌకొండ మాజీ ఎంపీటీసీ మేకల సతీష్, రాయపర్తి మాజీ సర్పంచ్ రావుల సరితరాజిరెడ్డి, ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామాల అధ్యక్షలు డైగ రాజు,తోగరు శ్రీనివాస్, ఇల్లందుల నాగరాజు, నారగాని రాకేష్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.