
రామాయంపేట: యూరియా కోసం రైతుల ఆందోళన..
రామాయంపేట సెప్టెంబర్ 8 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడి యూరియా బస్తాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నెల రోజులుగా తగినంత యూరియా లభించక పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సరిపడా యూరియా సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.