
హోతి కే-శేఖాపూర్ రోడ్డు మరమ్మత్తులు ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతి కే శివారు వంతెన నుంచి శేఖాపూర్ గ్రామం వరకు పాడైపోయిన రోడ్డు మరమ్మత్తు పనులు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు ఈ పనులు మొదలుపెట్టారని స్థానికులు తెలిపారు. ఈ రోడ్డు మరమ్మత్తులతో స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.