-జిఎస్టీ తగ్గింపుతో మేలు జరిగేనా!
-జనం నిజమని నమ్మమంటారా?
-పన్నులు పెంచి తగ్గించడం కూడా గొప్పేనా!
-ఏడేళ్లు ఏడిపించి ఇప్పుడు జోలపాడతారా!
-జిఎస్టీ తీసుకొచ్చిన రోజు దేశానికి రెండో స్వాతంత్య్రం అన్నారు.
-ఎడాపెడా స్లాబ్‌లు తెచ్చి పన్నులు బాదారు.
-ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు.
-ఇప్పుడు జిఎస్టీ తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నారు.
-పరోక్షంగా ప్రజలను పీడిరచుకు తిన్నామని ఒప్పుకున్నారు.
-జిఎస్టీ స్లాబ్‌లు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి పెద్దగా నష్టమేమీ లేదు.
-కేవలం 1.1 శాతమే తేడా వస్తుంది.
-ప్రభుత్వానికి 48 వేల కోట్ల నష్టమని కేంద్రం చెప్పడం విడ్డూరం.
-జిఎస్టీ తగ్గించారు సరే కంపెనీలు ధరలు పెంచితే చేసేదే ముంది!
-ధరల పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ.
-దానిని అదుపు చేయకుండా పన్నులు తగ్గించినట్లు ప్రకటిస్తే సరిపోతుందా!
-జనానికి ఊరట కల్గుతుందా?
-బంగారం మీద జిఎస్టీ తగ్గించామన్నారు.
-బంగారం ధర భారీగా తగ్గుతుందన్నారు.
-ఏడాలో తులం బంగారం ముప్పై వేలు పెరిగిం!
-నిత్యవసర వస్తువుల ధరలు అంతే…
-నాలుగు రోజులు తగ్గిస్తారు.
-కంపనీలు పెంచితే ఆటోమేటిక్‌గా ధరల భారం తప్పదు.
-ప్రభుత్వం చెప్పే గొప్పలకు అర్థముండదు.
-జనానికి ఊరట కల్గిన సంతోషం ఎంతో కాలం వుండదు.
-పన్నలు తగ్గిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని పాలకులే అంటారు.
-ఎన్నికలు రాగానే తగ్గించినట్లు ప్రకటించి మాయ చేస్తారు.
-జనానికి అన్నీ తెలుసు. భరించక తప్పదని తెలియంది కాదు.
-పన్నులు పీడిరపుకు మార్గం.
-అంతకన్నా ఏముంది దౌర్భాగ్యం
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రజలను బురిడీ కొట్టించడంలో రాజకీయ నాయకులను మించిన వారు లేరు. రాజకీయ నాయకులు ఏది చేసినా కరక్టె అనిపించుకుంటారు. తాము చేసిందే కరక్టని ప్రజల చేత కూడా అనిపిస్తారు. అదీ రాజకీయాలకు వున్న గొప్ప తెలివి. ప్రజాస్వామ్యంలో రాజకీయపార్టీలదే అంతిమ నిర్ణయం. అందుకే జనం ఏమనుకున్నా సరే..ఎన్నికల్లో గెచే దాక ఒకమాట. గెచాక ప్రజాభివృద్ది పేరుతో మరో మాట. రెండు నాలుకలు లేకుంటే నాయకులు కాలేదు. రాజకీయాలు చేయలేరని చెప్పడానికి చరిత్రలో అనేక సాక్ష్యాలున్నాయి. సరిగ్గా ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటూ జిఎస్టీని తెచ్చిం. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పన్నుల విషయంలో లెక్కా పత్రం వుండే కాదు. అంటూ జేపి చెప్పిన లెక్కలు జనం నమ్మారు. పన్నుల వసూలు అనేది ఎలా జరుగుతుందో కూడా లెక్క లేకపోతోం. దాంతో ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంటూ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వన్ నేషన్, వన్ టాక్స్ అంటూ ప్రజలను నమ్మించారు. ప్రజలు కూడా ఊరట కల్గుతుం. ధరలు పెద్దఎత్తున తగ్గుతాయని ఆశించారు. మన దేశంలో నూటికి ఎనభై మంది గువ మధ్య తరగతి ప్రజలే వుంటారు. వారికి రూపాయి ఆదా అయినా సరే అ ఎంతో భరోసాగా వుంటుందని ఆశించారు. అనుకున్నట్లుగానే కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చిం. 2017లో దేశమంతా అబ్బురపడేలా జిఎస్టీ తీసుకొచ్చారు. తాము తెస్తున్న జిఎస్టీ దేశానికి రెండో స్వాతంత్య్రం లాంటిదన్నారు. అర్ధరాత్రి స్వతంత్య్రం వచ్చినట్లే, జిఎస్టీని కూడా అర్ధరాత్రి ప్రకటించారు. అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. దేశమంతా ఆ కార్యక్రమాన్ని రాత్రంతా మేలుకొని టివీలకు అతుక్కొని తిలకించారు. గతంలో ఒక వస్తువు, ఒక ప్రాంతంలో ఒక రకమైన పన్ను. మరో ప్రాంతంలో మరో రకమైన పన్ను విధానం వుండే. ఇక దేశంలో ఎక్కడైనా ఏ వస్తువైనా సరే ఒకే పన్ను విధానం అని చెప్పారు. పన్నులను సరలీకృతం చేస్తామని చెప్పారు. దేశమంతా సంతోషపడిర. ఎంతో సంబరపడిర. దేశం కోసం, ధర్మం కోసమంటే ఇదే అని ప్రజలు కూడా బిజేపిని ఎంతో కీర్తించారు. జీఎస్టీ అమలు విషయానికి వచ్చే సరికి ఐదు రకాల స్లాబులు తెచ్చారు. అంతా గందరగోళంగా వుందన్న అనుమానం ప్రజలకు ఆలోనే తెలిసిపోయిం. తగ్గాల్సిన ధరలు పెరుగుతూ వచ్చాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతూ వెళ్లిం. జీఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి తెలిసి, చిన్న చిన్న వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఏదో జరుగుతుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే అటు ప్రజలకే కాదు, ఇటు వ్యాపారులకు కూడా జిఎస్టీ అనే గుడి బండగా మారుతూ వచ్చిం. ఏడా, రెండేళ్ల గడిచే సరికి దేశంలో వ్యాపారుల జీవితాలు తలకిందులౌతూ వచ్చాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. జిఎస్టీ తెచ్చి, దానిని అమలు కార్యాచరణ ప్రకటించిన వెంటనే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. జిఎస్టీ అనే పన్ను విధానంలో లోపభూయిష్టమైందన్నారు. ప్రజలకు నామాలు పెట్టడం తప్ప మరేం లేదన్నారు. ప్రజలను మరింత దోచుకునేందుకు ఎత్తుగడ అన్నారు. గతంలో పన్ను విధానాన్ని ఎత్తి చూపిన బిజేపి నిర్ణయం ప్రజలను పెనం మీద నుంచి పొయ్యిలో వేసినట్లే అవుతుందని అన్నారు. దాన్ని బిజేపి తీవ్రంగా తప్పు పట్టిం. పైగా ఆ సమయంలో ప్రతిపక్షాలకు పెద్దగా బలం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అప్పటికే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వుండే. రాహుల్ గాందీ మీద బిజేపి ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడుతుండేది. రాహుల్ ఏం మాట్లాడినా పెడర్దాలు తీసేవారు. ప్రజలు కూడా నిజమే కావొచ్చని, రాహుల్ చెప్పేదే అబద్దమని కూడా అనుకుంటూ వచ్చారు. బిజేపి మాటలనే బలంగా నమ్ముతూ వచ్చారు. కాని ప్రజలకు రాను రాను అర్ధమైం. జిఎస్టీ వల్ల పెద్ద బొక్క పడుతోందని అర్ధమైం. ఆ సమయంలో రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలు నిజమే అనే అనుమానం ప్రజలకు వస్తుందన్న సమయంలో జిఎస్టీ స్లాబుల్లో మార్పులు చేశారు. ఐదు స్లాబులన నాలుగు చేశారు. ప్రజలను ఊరడిరచారు. ప్రజలకు ఊరటక్పస్తున్నామని చెప్పారు. అయినా రాహుల్ గాంధీ హెచ్చరిస్తూనే వచ్చారు. జిఎస్టీ మూలంగా దేశంలో 18లక్షల చిరు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు కనుమరుగయ్యారు. కొన్ని కోట్ల మంకి ఉపా లేకుండాపోయిందని రాహుల్ చెప్పారు. ఇప్పుడు అదే నిజమౌతోం. ఒకదశలో ఆహార పదార్థాల మీద కూడా వేసిన పన్నులపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న. పాలు, పెరుగు మీద కూడా 12శాతం జీఎస్టీ వేశారు. దాంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైం. దాంతో మళ్లీ దానిని సవరించారు. ఐదు శాతానికి తెచ్చారు. స్కూలు పిల్లలు వాడే పెన్నులు, పెన్సిళ్లు, ఏరేజర్లు, నోట్ బుక్స్ ఇలా ప్రతి వస్తువు మీద జీఎస్టీ వేయడం పెద్ద చర్చనీయాంశమైం. ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై జిఎస్టీ వేయడాన్ని దేశమంతా తప్పు పట్టిం. కాలక్షేపం కోసం తినే పాప్ కార్న్‌లో కూడా మూడు రకాల పన్నులు వేయడం బిజేపి తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్న. అప్పటి నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎంత డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం స్పంంచలేదు. గత ఎన్నికల్లో బిజేపికి పూర్తి స్దాయి మెజార్టీ వస్తే ప్రజల జీవితాలు ఎలా వుండేవో అని అనుకుంటున్నారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఏర్పాటైం. బలమైన ప్రతిపక్షం తయారైం. దాంతో బిజేపిపై ప్రతిపక్షాలు అడుగడుగునా విజయం సాధిస్తున్నాయి. బిజేపికి గడ్డుకాలం కనిపిస్తోం. ఓ వైపు ఓట్ చోరీ అంటూ రాహుల్ గాందీ చేస్తున్న పోరాటం ప్రజలను బాగా ఆకర్షిస్తోం. ప్రజల్లో పెద్దఎత్తున చైతన్యం నింపుతోం. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన కేంద్రం ఎలాగైనా ఆ దేశానికి బుద్ది చెబుతుందని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలతో సహా,ప్రజలంతా అండగా నిచారు. పహల్గావ్లో టెర్రరిస్టులు చేసిన పనికి దేశమంతా కుతకుతలాడిర. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరిం. ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టిన కేంద్రం హటాత్తుగా ఆపరేషన్ ఆపేసిం. ఆపరేషన్ సిందూర్ అయిపోయం. పాకిస్తాన్‌ను చావు దెబ్బతీశామని ప్రజలు అనుకుంటున్న వేళ అమెరికా అద్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశం వ్యాప్తంగా ఒక్కసారిగా కళకళం రేపాయి. యుద్దం నేనే ఆపానంటూ ట్రంప్ చెప్పారు. ఒకసారి కాదు పదే పదే చెబుతూ వచ్చారు. దాంతో మన దేశ సార్వభౌత్వం మీద అమెరికా పెత్తనమేమిటనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోమొదలైం. ఈ సంఘటన ప్రతిపక్షాలకు మంచి ఆయుధమైపోయిం. ఇక అప్పటి నుంచి అటు ఓట్ చోరీ అంశం, ఇటు ఆఫరేషన్ సిందూర్ అంశాలతో కేంద్రాన్ని ఉక్కిరిక్కిరి చేస్తున్నాయి. త్వరలో బిహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పహల్గావ్ మీద దాడి జరిగిన రోజు ప్రధాని మోడీ ఇరాన్ పర్యటనలో వున్నారు. హుటాహుటిన దేశానికి చేరుకున్నారు. దానిపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారని అందరూఅనుకున్నారు. కాని మధ్యాహ్నం వరకు బిహార్ వెళ్లి ఎన్నికల సభలో మాట్లాడారు. ఇక్కడే ప్రతిపక్షాలకు, ప్రజలకు మరింత ఆగ్రహం వచ్చేలా చేసిం. పార్లమెంటు సమావేశాలలో అధికార బిజేపిని ప్రతిపక్షాలు ఊపిరి సలపనివ్వలేదు. ఇక ఎలాగైనా ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్న కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిం. ఆగష్టు పదిహేను స్వాతంత్య్ర నోత్సవం రోజున దేశ ప్రధాని మోడీ దీపావళికి ప్రజలకు కానుక ప్రకటిస్తున్నాను అని చెప్పారు. అందరూ ఏముంటుందని అనుకున్నారు. జిఎస్టీని తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడున్న నాలుగు స్లాబుల స్దానంలో రెండు మాత్రమే అమలు చేస్తామని చెప్పారు. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం చేశారు. ఇక ప్రజలు పండగ చేసుకొమ్మంటున్నారు. దాంతో ప్రతిపక్షాలు, ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు. కొండంత పెంచి రవ్వంత తగ్గించి పండగ చేసుకొమ్మడనం బిజేపికే చెల్లిందని ప్రతిపక్షాలు ఎదురు దాడి చేయడం మొదలు పెట్టాయి. ఇలా అయినా బిజేపికి వచ్చే రాష్ట్రాల ఎన్నికల్లో కలిసి వస్తుందని అనుకుంటే ఇక్కడ కూడా జిఎస్టీ ఎత్తుగడ పాచిక పారలేకుండాపోయిం. కాకపోతే కొంతలో కొంత ఊరట కల్గుతుందని అనుకుంటున్నారు. అయితే అది ఎంత కాలముంటుందో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ తగ్గిందని ధరలు తగ్గిస్తే, ఉత్పత్తి దారులు వస్తువుల ధరలు పెంచితే మొదటికే వస్తుందని నవ్వుకుంటున్నారు. ఇది బిజేపికి ఎంత మేర మేలు చేస్తుందో వేచి చూడాలి.