
Felicitation of Retired Teacher Anjana Devi on Teachers’ Day
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా (సి.సా.స) ఆధ్వర్యంలో మాదిరెడ్డి అంజనా దేవికి సత్కారం
సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మద్దిరెడ్డి అంజనా దేవి సిరిసిల్ల సాహితి సమితి వారు సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా (సి.సా.స) అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ.. సమాజంలో గురువు అనే వ్యక్తి చీకటనే అంధకారాన్ని చీల్చి,జ్ఞానం అనే కాంతి వెలుగును ఎంతో ఎంతో ఆనందదాయకమని తెలిపారు అందించేటువంటి వారు గురువులు అలాంటి గురువులకు ఒకరోజుగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు మద్దిరెడ్డి అంజనా దేవి ని సత్కరించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. అంతేకాకుండా జిల్లా మాజీ గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ..
విద్యార్థులను విజ్ఞానంతో వినయ విధేయతలతో, జీవిత పాఠాలు నేర్పించేదే గురువు అని అలాంటి గురువులను సన్మానించడం ఒక మంచి కార్యక్రమాన్ని అందుకు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. (సి. సా. స ) ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు అంజనా దేవి ని సన్మానించడం మాకు ఎంతో గర్వకారణమని అలాంటి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిదద్ధి, వారిని అనేక రంగాల్లో విద్యాబుద్ధులుగా నిలిచినటువంటి అంజానా దేవి నీ సత్కరించడం మాకు ఎంతో గర్వకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి సాస పూర్వ గౌరవ అధ్యక్షులు కోడం నారాయణ, కవి రచయిత జూకంటి జగన్నాథం, ఏరెడ్డి వెంకట్ రెడ్డి, నాయని సత్యనారాయణ రెడ్డి, దొంత దేవదాస్, గూడూరి బాలరాజ్, అంకారపు రవి, కవులు రచయితలు,కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.