
SRK School Celebrates Teachers’ Day with Student Participation
ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కె పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి మాట్లాడారు… ఉపాధ్యాయ వృత్తి నుంచి భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎదిగిన తనను మేమందరం ఆదర్శంగా తీసుకొని భారత దేశ అభ్యున్నతి కోసం పాటుపడతామని తెలిపారు.
ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులందరికీ బహుమతులు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులును అందరినీ శాలువాలతో సత్కరించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం హర్నిశలు కృషి చేయాలని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోల శ్రీనివాస్,డోకూరి సోమశేఖర్, అంబాల రాజేందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.