
MLA Donthi Madhav Reddy
స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యతియ్యాలి
నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం
నర్సంపేట,నేటిధాత్రి:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లు కేటాయించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్ కోరారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాలతో బుదవారం దొంతి మాధవరెడ్డిని హన్మకొండలోని సగృహంలో వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరవి పరమేష్ తో కలిసి తుమ్మలపెల్లి సందీప్ వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధానత్య ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.స్పందించిన ఎమ్మెల్యే దొంతి యూత్ కాంగ్రెస్ తోనే కాంగ్రెస్ పార్టీకి, దేశానికి బంగారు భవిష్యత్ అని కొనియాడారన్నారు.యువత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారని కష్టపడి పనిచేసే ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలోనే అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న.. తప్పక అమలు చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హమి ఇచ్చినట్లు సందీప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లా గౌడ్,నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంత రంజిత్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్కె షఫిక్,దుగ్గొండి మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నరిగె ప్రవీణ్, శ్రీకాంత్, అవినాష్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.