
Seerat-un-Nabi Sabha Held in Jahirabad
జహీరాబాద్లో సీరత్ఉన్నబీ సభ – మహిళల ఉత్సాహభరిత పాల్గొనిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,రబీ ఉల్ అవ్వల్ నెల సందర్బంగా జమాత్ ఇస్లామీ హింద్ సౌత్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో శాంతినగర్ ఇస్లామిక్ సెంటర్లో సీరత్ఉన్నబీ సభ జరిగింది.సభకు అధ్యక్షత వహించిన జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాజిదా బేగం మాట్లాడుతూ ప్రవక్త మహ్మద్ ముస్తఫా జననం మానవాళికి వరమని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి కరుణ, ప్రేమ, న్యాయం ప్రసాదించారని పేర్కొన్నారు.

ప్రత్యేక అతిథి సుమయ్య లతీఫీ అసిస్టెంట్ సెక్రటరీ, ఉమెన్స్ వింగ్, తెలంగాణ మాట్లాడుతూ సీరత్ బోధనలు కేవలం రబీ ఉల్ అవ్వల్లోనే కాక, జీవితాంతం ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.హాజరా బేగం, సయ్యదా మేహనాజ్, ఫహ్మీదా మఖ్మూర్, హాఫిజా సఫూరా సిద్దీఖా వేర్వేరు అంశాలపై ప్రసంగించారు.

హాఫిజా ఉమ్తుల్ ముబీన్ ఖురాన్ తిలావత్ చేశారు. జీఐఓ అధ్యక్షురాలు హుజైఫా అఫ్నాన్ నాత్ పఠించగా, సీఐఓ విద్యార్థినులు సున్నత్ పై నాటిక ప్రదర్శించారు.పిల్లల కోసం సీరత్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.