
New Ration Cards
లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: ఝరాసంగం మండలంలోని బొప్పనపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బుధవారము గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. ఆధార్‌కార్డుతో పాటు రేషన్ కార్డు ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో
పెద్ది శ్రీనివాస్ రెడ్డి అమృత్ బాలయ్య బసిరెడ్డి ప్రవీణ్ డీలర్ సత్తార్ తదితరులు లబ్ధి దారులు
పాల్గొన్నారు