
`అడుగడుగునా కేసీఆర్ కు అండగా నిలిచిన నాయకుడు.
`ప్రతి క్షణం పార్టీని కంటికి రెప్పలా కాపాడిన రక్షకుడు.
`టీఆర్ఎస్ పుట్టుక నుంచి పార్టీ కోసం పని చేసిన నాయకుడు.
`పార్టీ బలోపేతంలో కీలకపాత్రదారి హరీష్.
`తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ జెండా ఎగరడానికి కారణం హరీష్.
`కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నాయకుడు.
`ఉద్యమ స్వరం ఊరూర నింపిన నాయకుడు.
`ఊరూరు పార్టీకి కంచుకోట చేసిన నాయకుడు హరీష్.
`కేసీఆర్ కీర్తిని నలుదిశలా ప్రసరింప జేసిన నాయకుడు హరీష్.
`అవమానాలు భరించాడు.
`పార్టీని అర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాడు.
`ఉద్యమ సమయంలో అన్నీ తానై ముందు నడిచాడు.
`అందర్నీ సమన్వపరుస్తూ పార్టీని కంచుకోట చేశాడు.
`తెలంగాణలో బిఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా నిలిపాడు
హైదరాబాద్,నేటిధాత్రి:
అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే! ఎమ్మెల్సీ కల్వకుంట్ల తన వేలుతో తన కన్నే పొడుచుకున్నారు.. మాజీ మంత్రి హరీష్‌రావు, సోదరుడు సంతోష్‌లను అబాసు పాలు చేయాలన్న తాపత్రయంలో మొదటికే మోసం తెచ్చుకున్నారు. విపరీతమైన వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీలో కొందరు పొగబెడుతున్నారంటూ చేసిన తన వ్యాఖ్యలకన్నా, తానే పొగ పెట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. అయినా హరీష్‌రావు లాంటి నాయకుడిపై ఆరోపణలు చేస్తే జనం నమ్ముతారనుకోవడం కవిత మూర్ఖత్వం. కవిత లేనప్పుడే పార్టీ పురుడు పోసుకున్నది. కవిత లేనప్పుడే పార్టీ బలమైన పునాదులువేసుకున్నది. కవిత లేనప్పుడే పార్టీ బలమైన శక్తిగా మారింది. కవిత వల్లపార్టీకి జరిగిన మేలు లేదు. బిఆర్ఎస్ లేకపోతే కవిత లేదు. కేసిఆర్ కూతురు కాకపోతే కవితకు రాజకీయమే లేదు. ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. కవితను నాయకురాలు చేసిందే బిఆర్ఎస్ పార్టీ. ఆమెకు రాజకీయ జీవితం ఇచ్చిందే బిఆర్ఎస్. ఆ పార్టీ కేసిఆర్ చేతనే పురుడుపోసుకోవచ్చు. కాని ఆ పార్టీ అడుగులు వేయడంలో హరీష్ పాత్రే కీలకమైంది. గొప్పది. ఒక రకంగా చెప్పాలంటే హరీష్‌రావు లేకుంటే పార్టీ నడిచేదే కాదు. హరీష్‌రావు లేకుంటే పార్టీ ఇంత కాలం బతికేదే కాదు? ఇది ముమ్మాటికీ నిజం. తన జీవితం మొత్తం పార్టీకోసం అంకితం చేసిననాయకుడు హరీష్‌రావు. తన జీవిత లక్ష్యాన్ని కాదనుకొని పార్టీ కోసం జీవితం త్యాగం చేసిన నాయకుడు హరీష్‌రావు. వస్తుందో రాదో తెలియని తెలంగాణకోసం ఆయన పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. కేసిఆర్ రాజకీయ పార్టీ నామకరణం చేసి, హరీష్‌రావు భుజాల బాద్యతలు పెట్టారు. అప్పుడు కవిత ఇండియాలో కూడా లేరు. ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలపడిరదో అప్పుడు కవిత ఇండియాకు వచ్చారు. అప్పటికే కేసిఆర్ బలమైన నాయకుడుగా మారిపోయారు. అందుకు హరీష్‌రావు పాత్ర ఎంతో గొప్పది. నిజంగా తండ్రి మీద కవితకు ప్రేమ వుంటే ఆమె ఆనాడు టిఆర్ఎస్లో చేరాలి. పార్టీకోసం పనిచేయాలి. కాని ఆ పని చేయలేదు. తండ్రి పేరు చెప్పుకొని జాగృతి సంస్ధ ఏర్పాటు చేశారు. జాగృతితో ముందుకు సాగారు. కాని ఏనాడు పార్టీ కోసం కష్టపడిరది లేదు. తనదారి తాను ఎంచుకొని వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో భాగాస్వామ్యమయ్యారే గాని, బిఆర్ఎస్కు మేలుచేసింది లేదు. బిఆర్ఎస్ కోసం పని చేసింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే కవిత పార్టీలోకి వచ్చింది. ఎంపి సీటు తీసుకున్నది. గెలిచింది. బిఆర్ఎస్లో ఆమె ప్రస్తానమంతా పదేళ్లు మాత్రమే. కాని హరీష్‌రావు పాత్ర 26 సంవత్సరాలు. పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి పార్టీకి ప్రాణం పెట్టి పనిచేశాడు. అలాంటి నాయకుడిని అవినీతి పరుడు అని కవిత అంటే జనం కూడా నమ్మరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత మాట్లాడడం అంటేనే పరోక్షంగా తన తండ్రి కేసిఆర్‌ను ఇరికించినట్లే లెక్క. పైగా హరీష్‌రావును రెండోసారి అందుకే పక్కన పెట్టారంటూ లేనిపోని ముచ్చట్లు చెప్పితే కేసిఆర్ మీద ప్రజలకు వున్న నమ్మకాన్ని కవితే సన్నగిల్లేలా చేసినట్లౌవుంది. పార్టీ కోసం అంత పనిచేసిన హరీష్‌రావుపై హరీష్‌రావుపై కవిత వ్యాఖ్యలు ఎట్టిపరిస్ధితుల్లోనూ సరైనవి కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఒక్కసారిగా పార్టీని కుదిపేసినంత పనైంది. నిజానికి కవితపై గతంలోనే షోకాజ్‌లు నోటీసులిస్తారని అందరూ భావించారు. కాని కేసిఆర్ వేచి చూసే ధోరణి అనుసరించారు. గతంలోనే ఓసారి కేసిఆర్ ఎంతటి వ్యక్తులైనా సరే పార్టీ లైన్ దాటితే ఉపేంక్షించేదిలేదని పలు మార్లు ప్రకటించారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్‌ను పంపించిన సందర్భంలోనూ ఇదే విషయం స్పష్టం చేశారు. పార్టీలో ఏ స్ధాయిలో వున్నవారికైనా ఇదే వర్తిస్తుందని హెచ్చరించారు. అయితే కవిత తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించి, రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆఖరుకు పార్టీ రజతోత్సవ వేడుకల్లో తనకు తగిన ప్రాదాన్యత కల్పించలేదన్న అక్కసును దృష్టిలో పెట్టుకొని కేసిఆర్‌కు లెటర్ రాశారు. అది బైటకొచ్చింది. అందులో ఆమె చేసిన సూచనల ముసుగులో ఏకంగా కేసిఆర్‌ను ప్రశ్నించినట్లైంది. నిజానికి ఏ ప్రాంతీయ పార్టీలోనైనా సరే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా తక్కువ. అది ఎవరైనా సరే, పార్టీ అంతర్గత సమావేశాలలో మాత్రమే వెల్లడిరచాలి. ఆఖరుకు రజతోత్సవ వేదికపై కేసిఆర్ ఇలా అనుసరించేది వుండే అంటూ కొన్ని కీలక సూచనలు చేశారు. అది నిజానికి పార్టీ దిక్కరణ కిందకే వస్తుంది. పైగా ఆ లెటర్ లీకైన తర్వాత పార్టీలో కేసిఆర్ చుట్టూ దెయ్యాలున్నారంటూ మరో రకమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా కేసిఆర్ పట్టించుకోలేదు. పార్టీ శ్రేణులను కూడా పట్టించుకోవద్దని సూచించారు. ఇక మాజీ మంత్రి జగదీష్రెడ్డినిద్దేశించి మాట్లాడినప్పుడే ఆమెపై చర్యలు తీసుకుంటారన్న వార్తలు వచ్చాయి. ఓ వైపు కవిత తాను పార్టీలోనే వున్నానంటూనే మరో వైపు పార్టీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వుండేవారు. చివరికి ఆమె ఏకంగా హరీష్‌రావు, సంతోష్రావులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకే చుట్టుకున్నాయి. పార్టీలో ఇంకా ఎవరిపై కవిత వ్యాఖ్యలు చేసినా సహించేవారేమో? కాని హరీష్‌రావు, సంతోష్‌రావులపై చేసిన వ్యాఖ్యలు ఆమెను సస్పెండ్ చేసే వరకు వచ్చాయి. ఏ మాటకామాట చెప్పుకోవాలి. అసలు హరీష్‌రావు లేని బిఆర్ఎస్ను ఊహించుకోవడమే కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే హరీష్ రావు లేకుంటే కేసిఆర్ కూడా పార్టీని నడపడం కష్టం. బిఆర్ఎస్ పార్టీకి మొదటి సైనికుడు హరీష్‌రావు. అసలైన సైన్యాధ్యక్షుడు హరీష్‌రావు. కేసిఆర్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడు హరీష్ తప్ప ఇంకొకరు లేరు. సంతోష్‌రావు కూడా తర్వాత వచ్చారు. అడుగడుగునా కేసిఆర్ కు అండగా వుంటూ వచ్చిన హరీష్ రావు పోషించిన పాత్ర అంత సులభమైంది కాదు. సహజంగా రాజకీయాలు వేరు. ఉద్యమ రాజకీయాలు వేరు. రెండు రకాల పాత్రలు సమర్ధవంతంగా పోషించిన నాయకుడు హరీష్‌రావు. అటు కేసిఆర్ కోసం పనిచేయాలి. ఇటు ఉద్యమం కోసం పనిచేయాలి. మరో వైపు నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలి. ఇలా మూడు పాత్రలను కూడా అలవోకగా పోషించిన ఏకైక నాయకుడు హరీష్‌రావు. పార్టీ కోసం ఆయన తిండి,నిద్రలు మానుకొని పనిచేసినరోజులు అనేకం వున్నాయి. మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా హరీష్‌రావు కాళేశ్వర నిర్మాణం సమయంలో అనేక రాత్రులు అక్కడే నిద్రలు చేశారు. ఉదయమంతా పర్యటనలు, అదికారులతో రివ్యూలు, అభివృద్ధిపనులు, రాత్రికి మళ్లీ కాళేశ్వరానికి చేరి ఆ పనులు పర్యవేక్షలు చేసిన నాయకుడు హరీష్‌రావు. అలా ప్రాజెక్టు పూర్తయ్యేవరకు కాళేశ్వరం నిర్మాణ పనులతో సతమతమయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక అధ్భుతమైన కట్టడాన్ని తనచేతుల మీద నిర్మాణమౌతుందన్న ఆనందం ఒక వైపు, ఎంతో బాధ్యతతో పనిచేశారు. అనుకున్న సమయంలో అనుకున్న రీతిలో కాళేశ్వరం పూర్తి కావడం లో హరీష్ పాత్రను ఎవరూ శంకించలేదు. అంతగొప్పగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని ఏకైక నాయకుడు హరీష్‌రావు. ఇక సంతోష్‌రావు విషయానికి వస్తే మొదటినుంచి కేసిఆర్ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా కేసిఆర్ అనేక వేదికల మీద చెప్పారు. తన కోసం తన జీవితాన్ని త్యాగం చేసినందుకే సంతోష్‌రావుకు రాజ్యసభ ఇస్తున్నానని కూడా చెప్పారు. హరీష్‌రావుపై లేనిపోని వ్యాఖ్యలు చేసి కవిత తప్పు చేసింది. కవితపై చర్యలు తీసుకోకపోతే నేరుగా పార్టీ మీద మాట్లాడేవారు పెరుగుతారు. కవిత కూడా సరిగ్గా పార్టీ ఎదుగుతున్న తరుణంలో మరింత బలపడుతుందన్న విశ్వాసం ఏర్పడుతున్న సందర్భాన్ని చూసుకొని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీ రజతోత్సవ సభ విజయవంతమైందని పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్న సమయంలో లేఖ రాశారు. పార్టీలో అందరికీ వేదిక మీద మాట్లాడే అవకాశమిస్తే బాగుండేదంటూ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదంటూ పార్టీ శ్రేణులన్నీ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురు దాడి చేస్తున్న సమయంలో తన ఫోన్ ట్యాప్ అయ్యిందని కవిత చెప్పడంతో బిఆర్ఎస్ డిఫెన్స్‌లో పడే పరిస్తితి విచ్చింది. ఇప్పుడేమో కాళేశ్వరం విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసి, కాళేశ్వరం తెలంగాణ వర ప్రదాయిని అని నిరూపించే సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి పూర్గిగా వ్యతిరేకమైనవే అన్నది తేలింది. ఓ వైపు కేసిఆర్ మీద ప్రేమను చూపిస్తూనే, పరోక్షంగా కాళేశ్వరంలో అవినీతికి కారకుడు కేసిఆరే అనే అర్దం సృరించేలా కవిత వ్యాఖ్యలు చేసిన పార్టీ నుంచి దూరమైంది. ఏది ఏమైనా హరీష్‌రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం కూడా స్వాగతించలేదు. ఆమెపై తెలంగాణ సమాజం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైందని చెప్పక తప్పదు.