
Preventing Tragedies During Ganesh Immersion
ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ము .వినాయక చవితి సందర్భంగా భక్తులు వినాయక విగ్రహాలను మండపాలలో ప్రతిష్టించి తొమ్మిది రోజులపాటు కొలిచి చెరువులలో నిమజ్జనం చేసే విషయం మనందరికి తెలిసిన విషయమే. ఈ సంవత్సరం కూడా సంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామల్లో, పట్టణాలలో దాదాపుగా ప్రతి విధులలో వినాయక మండపాలను భక్తులు ఏర్పరిచారు, కానీ ఎత్తైన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠాణించడం వల్ల విద్యుత్ తీగలు సాగి ,తక్కువ ఎత్తులో ఉండటం వల్ల మరియు ఇంటర్నెట్ మరియు ఇతర కేబుల్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల విగ్రహాలు తీయగాలకు తగిలి కరెంట్ షాక్ తో భక్తులు మరణించే సంఘటనలు చాలా జరుగుతున్నాయి, గత వారం కృష్ణాష్టమి సందర్భంగా విద్యుత్ ఘాతం వల్ల సికింద్రాబాద్లో ఐదుగురు చనిపోగా, నిన్న కరీంనగర్లో వినాయక విగ్రహానికి విద్యుత్ వైర్లు తగడం వల్ల తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కావున జిల్లా వ్యాప్తంగా వివిధ రోజు లలో జరిగే వినాయక నిమజ్జనము సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బంది మరియు వినాయక మండప నిర్వహకులకు సమన్వయం పరుచుకొని విద్యుత్ వైర్లు సరైన ఎత్తులో ఉండేటట్లు పాత తీగలను సరి చేసేటట్టు కేబుల్ వైర్లను తొలగించేట్లు నిమజ్జన యాత్ర వెళ్లే దారుల ముందుగానే పరిశీలించి పోలీసు అధికారులు నిమజ్జనం సందర్భంగా ఇలాంటి విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి పునుకోవలని జహీరాబాద్ డి యస్ పి కి శివశంకర్ పాటిల్ వినతిపత్రం న్నీ అందించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, శ్రీనివాస్,మణిదర్ పాల్గొన్నారు.