
MIM Ready for Local Elections
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పొటీకి సర్వసిద్ధం
◆: – షేక్ రబ్బాని ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఆగష్టు 29: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందని పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు. ఝరాసంగం మండల పరిధిలోని పలు గ్రామలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒకటి, రెండు హామీలను అమలు చేసిన అవి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన అన్నారు. స్థానిక సమస్యలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని. దేశ లౌకిక విధానం, ఫెడరలిజానికి బిజెపి రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యయని అన్నారు. యూరియా కోసం కావాలని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన దొరకని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రావడం వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ముస్లింలను దళితులను క్రిస్టియన్లను వెనుకబడిన కులాలను అణచివేయాలని దొరల పరిపాలన తరిమి కొట్టాలని మన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగ పోరాటం చేసి మన హక్కులను తీసుకోవాలన్నారు చెప్పులు మోసే చేతులు కట్టుకునే దినాలు పోయాయన్నారు.