
CPI Leader Sudhakar Reddy
సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి,పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సంస్మరణ సభ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ 2025 ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్లోని, రవీంద్రభారతి యందు ఉదయం 11.00 గంటలకు జరగనున్నది. ఈ సంస్మరణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ‘. డి.రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, కామ్రేడ్ సయ్యద్ అజీజ్ పాషా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.ఈ సంస్మరణ సభకు ప్రతి జిల్లా నుంచి 50 మందికి తక్కువ కాకుండా కోట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన సంగారెడ్డి జిల్లాకు 50 మంది కోట ఇవ్వడం జరిగింది ఆగస్టు 30వ తేదీన ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్రభారతికి సకాలంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంస్మరణ సభలో పాల్గొనే వారందరూ పురుషులు ఎర్ర చొక్కాలు, స్త్రీలు ఎర్ర చీరలను ధరించి రావాల్సిందిగా కోరుతున్నామన్నారు,