
Ganesh Puja by Leaders in Jahirabad
కరంజ ప్రాజెక్ట్‌ని తలపిస్తున్న నిమ్జ్ రహదారి పరిసర పంట పొలాలు
◆:- పంట పొలాల్లో వరద నీటితో లబోదిబోమంటున్న పరిసర రైతులు
◆:- రోడ్డు నిర్మాణంలో ప్రణాళిక రహితంగా – నిర్మాణం చేపట్టడంతో రైతులకు తీవ్ర నష్టం
◆:- ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతుల వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానిఫెకచరింగ్ జోన్ నిర్మాణంలో భాగంగా జహీరాబాద్ మండల పరిధిలోని ఉగ్గేల్లి గ్రామ శివారు నుంచి బర్దిపూర్ గ్రామ శివారు వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మించిన విషయం తెలిసిందే. రోడ్డు నిర్మాణంలో సంబంధిత అధికారులు ప్రణాళిక రహితంగా నిర్మాణం చేపట్టడం, భారీ వర్షాలు కురిస్తే వరద నీరు పోవడానికి ఎలాంటి మార్గాలు చూపెట్టకపోవడంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డుకి ఇరువైపుల వరదనీరు నిలిచిపోవడంతో పంటలు నీట మునిగి రైతులు పెద్దమొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
నిమ్జ్ రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నట్టు రైతులు వాపోయారు. నిర్మాణ పనుల్లో ప్రణాళిక రహితంగా వ్యవహరించిన అధికారులు, గుత్తేదార్లపై చర్యలు తీసుకొని వర్షాలు కురిస్తే పొలాల్లో నీరు నిలిచిపోకుండా వరద నీటిని వాగులు, వంకలకు కనేక్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నిలిచిపోయిన వరద నీటి వల్ల పంట పొలాలు కర్ణాటక రాష్ట్రంలోని కరంజ ప్రాజెక్టును తలపిస్తుందని రైతులు, కూలీలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.