
Srikanth
న్యాయవాది పై దాడిని తీవ్రంగా ఖండించిన వరంగల్ బార్ అసోసియేషన్:-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
కూకట్పల్లి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు అడ్వకేట్ తన్నేరు శ్రీకాంత్ కోర్టు వారంట్ అమలు చేస్తూ ఉండగా జరిగిన క్రూర దాడిని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇట్టి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్ మాట్లాడుతూ ఒక న్యాయవాదిపై దాడి జరగడం అనేది న్యాయవ్యవస్థ గౌరవాన్ని, కోర్టుల అధికారం పట్ల చేసిన దారుణమైన సవాలుగా మేము భావిస్తున్నాము. నిందితులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి. రమాకాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, జాయింట్ సెక్రటరీ ముసిపట్ల శ్రీధర్ గౌడ్, లేడీ జాయింట్ సెక్రటరీ రేవూరి శశిరేఖ, లైబ్రరీ సెక్రటరీ గుండా కిశోర్ కుమార్,20 ఇయర్స్ సీనియర్ ఈసీ ఇజ్జగిరి సురేష్, 10 ఇయర్స్ సీనియర్ ఈసీ కలకోట్ల నిర్మలా జ్యోతి, ఈసీ మెంబర్లు మర్రి రాజు, జాటోత్ రవి, మడిపెల్లి మహేందర్, తోట అరుణ మరియు న్యాయవాదులు కోటేశ్వర్, దయాన్ శ్రీనివాస్, శివ, సదానందం, శ్రీనివాస్, భిక్షపతి, ప్రదీప్ , అనీల్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొని ఖండించడం జరిగింది.