
సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు
నిందుతుణ్ణి ఢిల్లీలో పట్టుకున్న జిల్లా సైబర్ టీమ్
వివారలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ఢిల్లీకి చెందిన సత్యం అనే వ్యక్తి ప్రస్తుతం CA చదువుతూ దొంగిలించిన మొబైల్ ఫోన్స్ యొక్క లాక్ లు తన తండ్రి మొబైల్ రిపేర్ షాప్ నందు లాక్ లు తీసి అట్టి మొబైల్స్ మరియు కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని భాగ్యనగర్ కాలనీ జమ్మలమడుగు కడప జిల్లా చెందిన ముల్లుంటి సలీం మాలిక్ అనే వ్యక్తికి కొరియర్ ద్వారా పంపగా ఇద్దరు కలసి ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం అంటూ బాధితులకు కాల్స్ చేస్తు హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తామని చెప్పి బాధితులకు దొంగిలించిన మొబైల్స్ నుండి కాల్ చేస్తూ వారికి ఒక లింక్ పంపించి ఆ లింకు ఓపెన్ చేసి UPI పిన్ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క ఆరోగ్యశ్రీలో ఖర్చయిన డబ్బులు తిరిగి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని మోసాలకు పాల్పడుతున్నరు.
అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముస్తాబాద్ మండలంలో ధమ్మా రాజిరెడ్డి అనే బాధితునికి మరియు వేములవాడ టౌన్ పరిధిలో బొల్గమ్ ప్రేమ కుమార్ అనే బాధితులకు నిందుతులు సత్యం మరియు సలీం మాలిక్ కాల్ చేసి ఆరోగ్య శ్రీ డబ్బులు రిఫండ్ చేస్తానని చెప్పగా బాధ్యతలు నమ్మి UPI పిన్ ఎంటర్ చేయడం ద్వారా ముస్తాబాద్ కి చెందిన రాజిరెడ్డి నాలపైఆరు వేల రూపాయలు, ప్రేమ కుమార్ పదివేల రూపాయలు నష్టపోవడం జరిగినది. రాజిరెడ్డి పిర్యాదు మేరకు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, ముస్తాబద్ ఎస్.ఐ గణేష్,జిల్లా సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, మరియు సిబ్బంది గంగారెడ్డి,రాజు, కిట్టు, మహేష్,ముస్తాబాద్ కానిస్టేబుల్ కాసిం లు టీమ్ గా ఏర్పడి సాంకేతికత ఆధారంగా గతంలో సలీం మాలిక్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని, సత్యంను ఢిల్లీ లో అదుపులోకి తీసుకొవడం జరిగిందని,సత్యం అనే నిందుతునిపై తెలుగు రాష్టాల్లో NCRP పోర్టల్ నందు 118 ఫిర్యాదులల్లో సుమారు 90 లక్షల మోసాలు చేసినట్టు గుర్తించడం జరిగిందని,
నిందుతుణ్ణి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. నిందుతులను పట్టుకోవడంలో కృషి చేసిన సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, ముస్తాబద్ ఎస్.ఐ గణేష్,సైబర్ టీం ఆర్.ఐ ఎస్.ఐ జునైద్ ,సైబర్ సిబ్బంది కిట్టు, గంగారెడ్డి,మహేష్, రాజు, ముస్తాబద్ కానిస్టేబుల్ కాశిం,
లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.