
Residents Demand Immediate Repairs on Jharasangam
ఝరాసంగం నుండి మేదపల్లి వెళ్ళే రోడ్ బాగు చేయాలి
◆:- సిఐటియు ఆధ్వర్యంలో ఆర్డిఓ ఆఫీస్ ఏవో కి వినతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజక వర్గం ఝరాసంగం నుండి మెదవల్లి వెళ్లే రోడ్డు వూర్తిగా గుంతల మయంగా మారిందని, తక్షణమే కొత్త రోడ్డు వేయాలని, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ఏవో కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డును కనీసం పట్టించుకున్న నాధుడు లేకపోవడం, అధికారులు ప్రజావ్రతినిధులు ఈ రోడ్డును ఎందుకు వట్టించుకోవడం లేదో సమాధానం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నా వట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఝరాసంగం మండల నాయకులు సురేష్, ఇతరులు నరేష్, శ్రీకాంత్, బాల్ రాజ్, నజీర్, సాయి కిరణ్ గౌడ్, తదితరులున్నారు.