
బుజ్జి మట్టి గణపతులనే పూజిద్దాం.
వనప్రేమి గోకా రామస్వామి
నర్సంపేట,నేటిధాత్రి:
రాబోయే గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణాన్ని పరి రక్షిద్దాం అని వన ప్రేమి గోకా రామస్వామి ఒక ప్రకటనలో పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుజ్జి బుజ్జి మట్టి గణపతులనే పూజిద్దామని మనల్ని దేవుడు పుట్టిస్తే మనం భగవంతుడిని పుట్టించే ఒక మహా పండుగ వినాయక నవరాత్రుల వేడుక అని పేర్కొన్నారు.

పార్వతి మట్టి గణపతిని చేసి ప్రాణప్రతిష్ట చేసిన ఒక మహా పండుగ వినాయకచవితి అని మట్టి గణపతులతో పూజిస్తూ నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకుందామని తెలియజేశారు.
ధ్వని,రంగులు,నీటి,వాయు,వాతావరణాన్ని కలుషితం చేయకుండా జాగ్రత్త లు పాటిద్దామని వనప్రేమి, పర్యావరణ వేత్త గోకా రామస్వామి తెలియజేశారు.