
Puppy Causes Biker Crash in Viral Video
కుక్క పిల్లే కదా అనుకుంటే ఎంత పని చేసింది.. బైకర్‌కు ఏమైందో చూడండి..
రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకర్.. కాసేపటి తర్వాత బండి స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కుక్క పిల్ల బైకర్‌ను చూసి వెంటపడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
వీధి కుక్కల వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వీటి బారిన పడుతుంటారు. తాజాగా, వీధి కుక్కల కేసు సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్క పిల్ల కారణంగా ప్రమాదానికి గురైన బైకర్ వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకర్.. కాసేపటి తర్వాత బండి స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కుక్క పిల్ల (Puppy Chasing the Biker) బైకర్‌ను చూసి వెంటపడింది. కరవకున్నా కూడా బండితో పాటే వేగంగా వెళ్తూ అతడిని తికమకపెట్టింది.
బైకర్ ఆ కుక్కపిల్లను చూస్తూ ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో బండి రోడ్డు పక్కకు దూసుకెళ్లి.. ఓ దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో (biker fell down) ఆ బైకర్ ఎగిరి పక్కన పడిపోయాడు. హెల్మెట్ కూడా ఎగిరి దూరంగా పడిపోయింది. చూస్తుంటే ఈ ప్రమాదంలో అతడికి గాయాలైనట్లు తెలుస్తోంది. బైకర్ కిందపడిపోగానే ఆ కుక్క పిల్ల.. ‘వచ్చిన పని అయిపోయింది’.. అన్నట్లుగా మళ్లీ వెనక్కు పరుగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఈ ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో ప్రాణాలతో బయటపట్టాడు.
ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అనుకున్న పని పూర్తి చేసిందిగా’.. అంటూ కొందరు, ‘ఈ కుక్క పిల్ల ఎంత పని చేసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 67 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.