
DMK Stronger Than Ever: KN Nehru
మాతో ఎవరూ సరితూగరు..
డీఎంకేతో సరితూగగల పార్టీ ఏదీ లేదని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ కేంద్ర మంత్రి అమిత్ షాను ఉద్ధేశించి పేర్కొన్నారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ బూత్ కమిటీల సమావేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్న డీఎంకే ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పీకి పారేద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
చెన్నై: డీఎంకేతో సరితూగగల పార్టీ ఏదీ లేదని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ(Minister KN Nehru) కేంద్ర మంత్రి అమిత్ షాను ఉద్ధేశించి పేర్కొన్నారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ బూత్ కమిటీల సమావేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్న డీఎంకే ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పీకి పారేద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో, తిరునల్వేలిలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ అప్పావుతో కలసి పాల్గొన్న మంత్రి కేఎన్ నెహ్రూ మాట్లాడుతూ… వేళ్లతో సహా పీకి పారేసేందుకు డీఎంకే చెట్టు కాదని, కోట్లాది మంది ప్రజల మద్దతుతో నాలుగేళ్లకు పైగా సుపరిపాలన అందిస్తుందన్నారు. 15 ఏళ్లుగా తమకు గిట్టని పార్టీల ప్రభుత్వాలను వేళ్లతో పీకేయడమే బీజేపీ పని అని, డీఎంకే గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పట్టించుకోబోమన్నారు.
అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో ఇంకా స్పష్టత రాలేదని, ఇప్పటికి మూడు సార్లు రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా ప్రతి సభలో, సంకీర్ణ ప్రభుత్వమేనని చెబుతున్నారే కానీ, అది ఏ పార్టీ నేతృత్వంలో ఉందో చెప్పకుండా దాటవేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్‌లాగే సీఎం స్టాలిన్‌కు కూడా మహిళల ఆదరణ పెరుగుతోందని, అందువల్ల వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారం కాపాడుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.