
Mishap in Rahul’s Yatra Again
రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి
క్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ చోర్ ఓట్ యాత్రలో మళ్లీ అపశృతి చోటు చేసుకుంది
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ చోర్ ఓట్ యాత్రలో మళ్లీ అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం ఈ యాత్రలో ఆయన చేపట్టిన బైక్ ర్యాలీలో.. వెనుక వస్తున్న ఒక బైక్ పడిపోయింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తులు కింద పడిపోయారు. వీరికి గాయాలయ్యాయి. దాంతో ర్యాలీలో పాల్గొన్న వారు.. వెంటనే స్పందించి.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పుర్ణియా జిల్లాలో ఆదివారం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి రాహుల్ గాందీ ఈ యాత్ర నిర్వహిస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
బిహార్‌లో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఆగస్ట్ 16వ తేదీన ససారాంలో ఎంపీ రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర నవాడా జిల్లాలో కొనసాగుతున్న సమయంలో.. ఆయన కారు కింద కానిస్టేబుల్ పడిపోయారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని రక్షించి.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. అయితే ఈ ప్రమాదం నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ యాత్రలో బైక్ ర్యాలీ జరుగుతున్న వేళ.. మళ్లీ ప్రమాదం చోటు చేసుకోంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ఆగస్టు 1వ తేదీన పాట్నాలో ముగియనుంది. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అధికారాన్ని చేపట్టాలని ఎన్డీయే భావిస్తుండగా.. ఆ పార్టీ అధికారానికి గండికొట్టాలని ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి.