
Sub Post Office Needed in Tekumatla
టేకుమట్లలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి
సబ్ పోస్ట్ ఆఫీస్ లేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని దాంతో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందుతాయని కొన్ని తపాలా సేవల కోసం ఇతర మండలాలకు వెళ్లే పరిస్థితి ఉండదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు టేకుమట్ల మండల కేంద్రంలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఉందని దానివలన వినియోగదారులు కొన్ని సేవలు మాత్రమే పొందుతున్నారని ఇతర కొన్ని తపాలా సేవల కోసం పనుల కోసం చిట్యాల మండల కేంద్రంలోని సబ్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు వికలాంగులు చిట్యాలకు వెళ్లి తపాలా సేవలు పొందు టకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని అలాగే దూర కూడా వెళ్ళవలసి వస్తుందని అంటున్న ప్రజలు వరంగల్ పార్లమెంటు సభ్యులు స్థానిక ఎమ్మెల్యే సంబంధిత జిల్లా తపాలా శాఖ అధికారు లు స్పందించి టేకుమట్ల మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని టేకుమట్ల మండల ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు