Grand Felicitation to Sangappa, New Ganesh Utsav Committee President
నూతనంగా ఎన్నికైన సంగప్పకు ఘన సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ సార్వజనిక గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన బొల్దార్ సంగప్పను గురువారం ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ఘనంగా సన్మానించారు. అంతకుముందు జహీరాబాద్ నియోజకవర్గ ఎన్ఎంఆర్ యువసేన అధ్యక్షులు బొయిని రవి ముదిరాజ్, మహేష్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో భీష్మ పితులు రాష్ట్ర కార్యదర్శి బొల్గార్ సంగప్పను శాలువ పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పదవులు మరేన్నొ ముందు ముందు ఉన్నత స్థాయికి ఎదగాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు నర్సాపూర్ గోపాల్ పాల్గొనడం జరిగింది.
