
Mandakrishna Madiga: True Ally of Muslims
ముస్లింలా నిజమైన పక్షపాతి మందకృష్ణ మాదిగ.
◆:- అబ్రహం మాదిగ………
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముస్లింలా హక్కుల కోసం పోరాడింది.
దాడులు జరిగితే ఉద్యమించింది..
సచార్ నివేదిక అమలుకు నినదించింది.
రిజర్వేషన్ల వాటా కోసం స్పందించింది..
బట్టలు కాదు.. బ్రతుకు కావాలంటూ
రాజకీయ ప్రాతినిధ్యంకై రణం చేసింది..
ఉగ్రవాదుల పేరుతో ఎన్కౌంటర్ చేస్తే
ముక్తకంఠంతో నిరసిస్తూ ఖండించింది.
సినిమాలలో మీడియాలో సామాజిక మాధ్యమాల్లో
ముస్లింలు అంటేనే టెర్రరిస్టులుగా, సంఘవిద్రోహ శక్తులుగా చూపిస్తుంటే ఆ సమాజ పోకడను
తప్పుబట్టి సమానత్వపు సందేశాన్ని ఇచ్చింది దండోరా.
హిందూ దేవాలయాలకు కెసిఆర్ వందల కోట్లు ప్రకటిస్తుంటే, హిందూ దేవాలయాలే కాదు
ఘన చరిత్ర కల్గిన పవిత్ర మక్కా మసీదుకు కూడా వందకోట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది.
నసీమా అనే చిన్నారి గుండె కోసం తల్లడిల్లింది
ఆసమస్య పరిష్కారానికి ఓ నూతన పోరాటానికి శ్రీకారం చుట్టి వేలాది గుండెలను ఒకటి చేసి పోరాటం చేసింది. “ఆరోగ్యశ్రీ పథకమై” ఆయుస్సు పోసింది.
ఆడ బిడ్డల మాన-ప్రాణాలను కాపాడే కర్తవ్యాన్ని
భుజాన మోసింది..అసిఫా, తార బేగం లాంటి ఎందరో ముస్లిం బిడ్డలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే వాటిని నిరసిస్తూ ముస్లింల గొంతై గర్జన చేసింది.
తెలంగాణ పోరులో ముందున్నా దగా పడ్డ
రహిమున్నిసా త్యాగాన్ని తట్టిలేపింది.
మదార్ సాహెబ్ అన్నను మా సంఘానికి
జిల్లా అధ్యక్షుల్ని చేసి అనేక సామాజిక పోరాటాల్ని ముందుకు నడిపింది..మాదిగ హక్కులే మానవ హక్కులంటూ సమరం సాగించింది.
తాను పెట్టిన మహాజన సోషలిస్టు పార్టీలో
ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించింది.
పలు జిల్లాలకు జిల్లా అధ్యక్షులుగా నియమించింది.
రజి హైదర్, ఇస్లాముద్దీన్ గార్లను లీడర్లుగా నిలబెట్టింది.
సెల్లులో బందీలు కాదు ముస్లింలు “బాద్ షా” లవ్వాలన్నది.. షేక్ బందగీల్లా తెగువ చూపాలన్నది ముస్లింల అభ్యున్నతి కోసం నిబద్ధతతో కొట్లాట కొనసాగించింది మాన్యులు మందకృష్ణ మాదిగ గారే.!
జస్టిస్ మురళీధరన్ కమిషన్, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్, జస్టిస్ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ఇలా అనేక కమిటీలు వేసినా సిఫారిసులు చేసిన వాటిని అమలు చేయకుండా ప్రభుత్వాలు దగా చేస్తుంటే, ఆమోసాన్ని ఎండగడుతూ ఉద్యమించింది.
ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే వారిపక్షాన మాట్లాడితే మా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని పార్టీలు వివిధ నాయకులే మౌనం వహిస్తుంటే, ముస్లింలకు మద్దతుగా నిలబడి, మేము అండగా ఉన్నామని ప్రకటించి వారి పక్షాన నిలిచింది.
ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, వేసిన కమిటీల సిఫారసులను అమలు చేస్తే చాలు ముస్లింల జీవన విధానంలో మార్పులు, పురోగతి వస్తుందని వాటి అమలుకు డిమాండ్ చేసింది, వక్ఫ్ భూముల పరిరక్షణకు తన వానిని వినిపించింది. వారి అభివృద్ధి,అభ్యున్నతికి తనదైన శైలిలో శ్రమించింది ఎమ్మార్పీఎస్ ఉద్యమమే.
దళిత్-ముస్లిం భాయ్ భాయ్”
“దళిత-ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి” అనే
నినాదం ఇచ్చింది.. ఆ నినాదానికి బలమైన
పునాది వేసింది, ఆత్మీయతను పంచి అనురాగాన్ని పెంచింది. ఏజాతి అయినా స్వయంగా తన గుణగణాలను మార్చుకోనంత వరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు: దివ్య ఖురాన్ 13:11 సూక్తిని సందేశంగా ఇచ్చి ఐక్య పోరాటాలకు మన జాతుల విముక్తికి ఉద్యమించాలని పిలుపునిచ్చి మహోన్నతమైన సామాజిక, సంస్కృతిక, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమ సంఘం ఎమ్మార్పీఎస్.
ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో, ఇంకెన్నో ఉన్నాయి అందుకే
ముస్లింలా పక్షాన నిజాయితీగా నిలబడి నిరంతరం పోరు చేసింది ముస్లింల పక్షపాతిగా నిలిచింది మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారే.
అతడే నిఖార్సయిన నాయకుడు,
నిజమైన సమాజ సేవకుడు
అన్నివర్గాలకు ఆప్తుడు,
ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడి
అక్కున చేర్చుకునే ఆత్మీయుడు
అపదోస్తే అండగా నిలిచే మహోన్నతుడు
మానవత్వపు పోరాటాలకు, మనిషి తత్వపు ఉద్యమాలకు కేంద్ర బిందువు అతడు.
అతడే..
సామాజిక న్యాయ స్వప్నం అతడే
మానవ హక్కుల రూపం అతడే.
కాబట్టి ముస్లింలు ఇప్పటికైనా ఒక సరికొత్త స్వతంత్ర ఉద్యమ, రాజకీయ ప్రణాళికలతో ముందుకు నడవాలి.. ముస్లింల కోసం మాదిగలు చేసిన త్యాగాన్ని,పోరాటాన్ని మరవకుండా మదిన పెట్టుకోవాలి.
నాటి స్వాతంత్ర్య ఉద్యమ అనంతరం అంబేద్కర్ గారిని విశ్వసించక గాంధీ గారిని నమ్మి, వారు చేసిన కుట్రలకు బలై నష్టపోయినట్టుగా మరొకమారు మోసపోకండి..
కృష్ణ మాదిగ గారి సారధ్యంలో సమరం సాగించండి
అలయ్.. బలయ్ తోనే లాడాయికి సిద్ధమవ్వండి.
పవిత్రంగా కొలిచే ఈరంజాన్ పర్వదినమే ముస్లిం వర్గాల ప్రజల్లో నూతన మార్పుకు నాంది కావాలని.. పార్టీల జెండాలు కాదు.. మన ప్రజల ఎజెండాలకు అనుగుణంగా ముందుకు నడవాలి.. జరుగుతున్న నష్టాన్ని గ్రహించి, పార్టీల, నాయకుల అణిచివేత దోపిడిలను మదిన తలిచి, పీడిత వర్గాలతో కలిసి సంఘటిత శక్తిగా నిలిచి, మనకోసం కొట్లాడే గొంతులకు ముస్లింలు అండగా నిలవాలి.. ఓటు చైతన్యంతో కూడిన రాజకీయ, ప్రజా చైతన్య పోరాటాలకు, దళిత ముస్లింల శాశ్వత ఐక్యతకు, పీడిత వర్గాల రాజ్యాధికార సాధనకు కేంద్రమవ్వాలని, దానికి సామాజిక న్యాయమే, సమానత్వపు సూత్రమే పునాదిగా రాజ్యాంగ ప్రవేశిక లక్ష్యాలే మేనిఫెస్టోగా మహనీయుల మార్గంలో మందకృష్ణన్న ఆశయానికి బలమై ముందుకు సాగాలని ఆదిశగా ఇప్పటినుండే అడుగులు పడాలని ఆశిస్తున్నామన్నారు,