
N. Karunakar Inspector of Police Mattewada
ఎన్.కరుణాకర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మట్టేవాడ
“నేటిధాత్రి”, వరంగల్.
ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ (OU) జాక్ “మార్వాడే గో బ్యాక్” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునివ్వడం అలాగే షాపులు, దుకాణాలు, మార్కెట్ల బంద్ పాటించాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టవలసిందిగా జాక్ నాయకులు పిలుపు ఇచ్చారు.

దీంతో మట్టేవాడ పి.ఎస్ పరిధిలోని డాల్ఫిన్ వీధిలో సెల్ ఫోన్ రిపేర్ షాపులు నడుపుకుంటూ జీవిస్తున్న కొందరు స్థానికులు తెలిసి తెలియక జాక్ నాయకుల పిలుపుకు స్పందించి సుమారు 21 మందితో ఈ రోజు మార్వాడిస్ గో బ్యాక్ అనే బ్యానర్లతో వారి వీధిలో ఒక శాంతియుత ప్రదర్శన జరిపినారు. దాంతో మేము అప్రత్తమై వారిని అదుపులోకి తీసుకొని ముందస్తు చర్యగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి వారికి కౌన్సెలింగ్ చేయడం జరిగింది. ఇటువంటి ప్రదర్ధానలకు కుల, మత, వర్ణ, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే ఎటువంటి కార్యక్రమాలకు మా పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు ఇవ్వడం జరగదని, అలాగే ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించడం అయినది. అలాగే మార్వాడీలు, ఇతర ప్రాంతీయ మైనారిటీ సమూహాల భద్రతకు అండగా ఉంటామని సందేశాన్ని ఇవ్వడం గురించి ఈ రోజు సాయంత్రం 03:30 గంటల నుండి 6:30 గంటల మధ్య స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్సైలు సాంబయ్య, శివకృష్ణ, లచ్చయ్య, రాజేందర్ మరియు మహిళా, పురుష సిబ్బంది సుమారు 50 మందితో మట్టవాడ పరిధిలోని ఎస్.వి.ఎన్ రోడ్, పాపయ్యపేట చమన్, బట్టల బజార్, డాల్ఫిన్ గల్లి, జే.పీ.ఎన్ రోడ్, దుర్గేశ్వర స్వామి టెంపుల్ వీధి, మండి బజార్, పోచమ్మ మైదాన్, గోపాలస్వామి గుడి, ఎంజీఎం సర్కిల్ మీదుగా బల్దియా ఆఫీస్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. శాంతి భద్రతలకు విగాథం కలిగించే ఎవరిని ఉపేక్షించడం జరగదని ఈ విషయంలో అన్ని పార్టీలు వర్గాలు వ్యాపారస్తులు పోలీసు వారికి సహకరించి రాబోయే గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకునేలా సహకరించాలని సూచించడం అయినది.
N. Karunakar, Inspector of Police ,ప్రజలకు తెలిపారు