
Essay Competition by Satya Sai Seva Samithi
“సత్య సాయి సేవా సమితి” ఆధ్వర్యంలో “డిగ్రీ” విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
మెట్ పల్లి ఆగస్టు 22 నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 10 వ తేదీన “సత్యసాయి సేవా సమితి” ఆధ్వర్యంలో “వ్యాసరచన” పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.కే.వేంకయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు.మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో శుక్రవారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ,సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలలో “భవిష్యత్తు కోసం ప్రస్తుతం మనం ఏమి చేయాలి”( ది ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ వాట్ వి డు ఇన్ ద ప్రెజెంట్) అన్న శీర్షికపై విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహించడం జరుగుతుందని,ఈ పోటీలు ఉదయం 11 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ – కళాశాల విద్య కమీషనర్ (సీ సీ ఈ) శ్రీమతి ఏ.దేవసేన మరియు సీసీఈ జాయింట్ డైరెక్టర్ ఆచార్య డీ ఎస్ ఆర్ రాజేందర్ సింగ్ లు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.కళాశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రథమ ,ద్వితీయ, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు ఈ బహుమతులను ప్రదానం చేస్తున్నారని ఆయన వివరించారు. మానవ విలువలను పెంచడం కోసమే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొంటూ “సత్య సాయి సేవా సమితి” స్పష్టంగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఈ పోటీలలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య పిలుపునిచ్చారు. ఇతర సమాచారం కోసం 98493 94561 నెంబర్ కు కాల్ చేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో కళాశాల కామర్స్ హెచ్.ఓ.డి ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్, దశరథం, బోధనేతర సిబ్బంది లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్, లింగం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.