
BJP Leaders Pre-Arrested in Bhupalpalli
బీజేపీ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్లలో బీజేపీ పార్టీ నాయకుల ముందస్తు అరెస్టు దృష్ట్యా మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ
రాష్ట్రంలో కొన్ని వర్గాల వారు మార్వాడీ గో బ్యాక్ అనే కృత్రిమ ఉద్యమంతో తెలంగాణలో అశాంతికి ప్రయత్నిస్తున్న సమాచారంతో అలాంటి దుశ్చర్యలకు పాల్పడే వర్గాలను వదిలేసి బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు
ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు ప్రాంతీయ తత్వం అంటగట్టి , బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వచ్చి ఇక్కడి సమాజంతో కలిసిమెలిసి జీవిస్తున్న మార్వాడీ లపై కొన్ని వర్గాలు ముఖ్యంగా హిందూ వ్యతిరేక భావజాలం గల శక్తులు, కమ్మ్యూనిస్ట్ భావజాలం గలవారు, ప్రాంతీయతత్వం లేకపోతే పబ్బం గడవని బిఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
పది రోజుల కింద హైదరాబాద్ లో మహబూబ్నగర్ కి చెందిన ఒక హిందూ కట్టెల వ్యాపారి మూలంగా తమ వ్యాపారం సరిగా జరగట్లేదని నలుగురు ముస్లింలు ఆ మహబూబ్నగర్ వ్యక్తిని హత్య చేసారు. ఆ హత్య పై ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అని కృత్రిమ ఉద్యమానికి ప్రయత్నం చేస్తున్న ఈ హిందూ ద్రోహూలు ముస్లిం గో బ్యాక్ అని ఉద్యమం చేయలేదు. ఈ హిందూ ద్రోహులు ప్రాంతీయవాదులు ఎప్పుడూ ‘రోహింగ్యా గో బ్యాక్ బంగ్లాదేశీ గో బ్యాక్ లేదా పాకిస్తానీ గో బ్యాక్ అని ఉద్యమాలు చేయలేదు కానీ దేశ భక్తులైన మార్వాడీలను గో బ్యాక్ అంటున్నారు అంటే వాళ్ల నిజస్వరూపం ప్రజలు గ్రహించాలి.
దేశం అందరిది, ఎవరైనా ఎక్కడైనా జీవనం కొనసాగించవచ్చు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు, బతుకుదెరువు చూసుకోవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. మండలంలో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడి ప్రజలతో కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్న వారికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అరెస్టు అయిన వారు మండల ప్రధాన కార్యదర్శి గాజుల అజయ్ మండల నాయకులు చిలుక ప్రణీత్ దానవీని చిన్న కుమార్ తదితరులు అరెస్టుఅయ్యారు