
BRS Leader Burr Rambabu Passes Away
అనారోగ్యంతో బి.ఆర్.ఎస్ నేత బుర్ర రాంబాబు మృతి
నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నేటిధాత్రి ఐనవోలు:-
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బుర్ర రాంబాబు గౌడ్ అనారోగ్యంతో మరణించారు. ఇట్టి విషయం తెలుసుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వారి ఇంటికి వెళ్లి రాంబాబు భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని ధైర్యం చెప్పినారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ తంపుల మోహన్, గ్రామ అధ్యక్షుడు కట్కూరి చంద్రమౌళి, మాజీ ఆత్మ డైరెక్టర్ కట్కూరి రాజు, గ్రామ కార్యదర్శి గద్దల ప్రభాకర్, టిఆర్ఎస్ నాయకులు కట్కూరి ఉపేందర్, గువ్వల కృష్ణ బాబు, తిరుమల్ రెడ్డి, బొక్కల స్వామి, కంజర్ల శ్రీనివాసరావు, కట్కూరి శంకర్, దిలీప్ రావు, గోవర్ధన్, రాజేష్, మధుకర్, రాజు, సైనిక్ సందీప్ వేణుమాధవ్, జిల్లా మండల గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యూత్ సోషల్ మీడియా నాయకులు ఉన్నారు.