
Singareni Contract
కాంటాక్ట్ కార్మికులకు ఎస్ వి ఎస్ యజమాన్యం జీతాలు ఇవ్వడం లేదు
సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించాలి
భూపాలపల్లి నేటిధాత్రి
ఎస్ వి ఎస్ సింగరేణి కాంటాక్ట్ యజమాన్యం కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేసిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బందు క్రాంతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ వి ఎస్ సింగరేణి కాంటాక్ట్ యజమాన్యం జూలై నెల గడిచి
ఆగస్టు నెల 20వ తారీకు వచ్చిన ఇంతవరకు జీతాలు ఇవ్వడం లేదు అని కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చెందుతున్నారని ప్రతి నెల 7వ తారీకు చెల్లించాల్సిన జీతాలు నేటికీ 20వ తారీకు వచ్చిన జీతాలు వేయడం లేదు
దీంతో బ్లాస్టింగ్ కార్మికులు. వోల్వో ఆపరేటర్లు. హెల్పర్లు మిషన్ ఆపరేటర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ కే టికే ఓసి2. ఓసి 3. కాంట్రాక్టర్ ఒకే కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ కావడం వలన అధికారులు పట్టించుకోవడం లేదు
సేఫ్టీ విషయంలో పట్టించుకునే అధికారులు కార్మికుల జీతాల విషయాల్లో ఎందుకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ప్రతినెల 10వ తారీఖు లోపు వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో
జిఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు
అంతేకాకుండా ఈనెల 22వ తారీకు నాడు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసమై కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 22 సింగరేణిలో అమలు చేయాలని నిర్వహించిన చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.