
గణపురం మండలంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల తో ముక్కులు
పవిత్ర శ్రావణమాసం లో
చివరి బుధవారం పోచమ్మ తల్లికి బోనాల మొక్కులు
మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారికిని రెండు గ్రామస్తులు పూజించారు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం గణపురం లక్ష్మారెడ్డిపల్లి రెండు గ్రామాలలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
పవిత్ర శ్రావణమాసం పురస్కరించుకుని చివరి బుధవారం పోచమ్మ తల్లికి బోనాలతో మొక్కులు సమర్పించుకున్నారు. నియమ నిష్ఠలతో మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారిని పూజించారు.
డప్పు వాయిద్యాల నడుమ,శివ సత్తుల పునకాలతో గ్రామ వీధులలో ఊరేగింపుగా బోనాలు నెత్తిన ఎత్తుకుని పెద్ద సంఖ్యలో రెండు గ్రామస్తులు పోచమ్మ తల్లి దగ్గరికి చేరి వైభవంగా వేడుక నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లి ని కోరుతూ కోళ్లు,పొట్టేలను అమ్మవారికి బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు.