
*పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి నేటి ధాత్రి
నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను బుధవారం ఉదయం కమిషనర్ ఎన్.మౌర్య అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలోని నిమ్మకాయల వీధి,మిట్ట వీధి, రాములవారి గుడి వీధి, కాళికమ్మ గుడి తగితర ప్రాంతాల్లో కార్పొరేటర్లు కుడితి సుబ్రమణ్యం, శైలజ, అధికారులతో కలసి పరిశీలించారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉండడం తో నీరు అక్కడే ఆగి పోయి అపరిశుభ్రత అవుతోందని అన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని కాలువలు శుభ్రం చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే నగరంలో ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా తొలగించాలని అన్నారు. ప్రజలు కూడా తమనవంతు సహకారం అందిస్తే నగరం సుబ్రంగా ఉంటుందని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,ఏసిపి మధు,డి.ఈ లు రాజు, శిల్ప,సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.