
మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా
నడికూడ,నేటిధాత్రి:
మండలం లోని చౌటుపర్తి,నడికూడ, కౌకొండ గ్రామాలలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన ఎలుగటి రవీందర్ రెడ్డి,దుప్పటి మరియమ్మ,బూరం పెద్ద మల్లయ్య,గోల్కొండ శాంతమ్మ,దంచనాల కమలాకర్ కుటుంబాలను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.