
Vinayaka Chavithi Review Meeting in Zaheerabad
జహీరాబాద్ లో వినాయక చవితి సమీక్ష సమావేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో బుధవారం మధ్యాహ్నం డీఎస్పీ సైదా అధ్యక్షతన వినాయక చవితి పండగ సందర్భంగా ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఐలు కాశీనాథ్, నరేష్, వినయ్ కుమార్ తో పాటు పురపాలక, రోడ్లు భవనాలు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.