
Aakash announces 250 crore scholarships
*తిరుపతి ఆకాష్ లో ఆంథే 2025 పోస్టర్ ఆవిష్కరణ..
*250 కోట్ల స్కాలర్షిప్పులు ప్రకటించిన ఆకాష్..
తిరుపతి(నేటి ధాత్రి)
ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆంథే 2025 పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 250 కోట్ల రూపాయలు విలువైన స్కాలర్షిప్లను ప్రకటించినట్టు ఇక్కడ తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఎయిర్ బైపాస్ రోడ్ లో గల సంస్థ కార్యాలయంలో స్టేట్ అకాడమిక్ ఆపరేషన్ హెడ్ ఆర్ వి ఎస్ ఎన్ మూర్తి, రీజనల్ సేల్స్ హెడ్ నిశాంత్ మిశ్రా, సీనియర్
అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ విజయ్ కుమార్, రీజినల్ మార్కెటింగ్ హెడ్ మోడేo నరసింహులు, బ్రాంచ్ మేనేజర్ సుబ్రమణ్యం పోస్టర్ విడుదల అనంతరం విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరుగుతుంది. అంతే 2025 ను విజయవంతంగా 16వ ఏట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి నూరు శాతం ఉచితంగా శిక్షణ పొందడంతో పాటు పలు క్యాష్ ప్రైస్ ప్రకటించినట్టు తెలిపారు. ఆంథే 2025 పరీక్ష ఆఫ్లైన్ విధానo లో అక్టబర్ 5, 12 తేదీల్లో వివిద కేంద్రాల్లో
నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు క్లాస్రూమ్, ఆకాష్ డిజిటల్ మరియు ఇన్విక్టస్ కోర్సుల కోసం స్కాలర్షిప్లు ఇవ్వబడతాయి. గత ఏడాది, ఈ పరీక్షలో 10 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం ద్వారా కొత్త రికార్డ్ స్థాపించబడింది. నీట్ యుజి, జేఈఈ మెయిన్ మరియు అడ్వాన్స్డ్ లో
టాప్
ర్యాంకులలో ఉన్న విద్యార్థుల్లో చాలామంది ఆంథే ద్వారా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు
ఈ అవకాశాన్ని 9 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు
సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీట్, జేఈఈలలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న ఆకాష్ సంస్థ ద్వారా శిక్షణ పొందే వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తర్ఫీదు నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్లో వెబ్సైట్ https://anthe.aakash.ac.in/home
ఆఫ్ లైన్ పరీక్ష రాయాలనుకునే వారు సమీప ఆకాష్ కేంద్ర లో సంప్రదించవచ్చునని వెల్లడించారు. కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు సాయి రాజ్, చిరంజీవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.