"Ramadugu Congress Celebrates Rajiv Gandhi’s Birth Anniversary"
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
రామడుగు, నేటిధాత్రి:
వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్ (తాజా మాజీ ఎంపీపీ)
రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసినివాళులర్పించారు. ఈసందర్భంగా రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ భారతదేశంలో ఆధునికరణ, ఐటీ సంస్థలు నిలపడంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎంతో అహర్నిశలు కష్టపడిన నేత రాజీవ్ గాంధీ అని తెలిపారు. ఈవేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల మాజీ సర్పంచ్ కోల రమేష్, మాజీ మండల అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, గ్రామశాఖ అధ్యక్షులు కర్ణ శీను జెట్టిపల్లి వీరయ్య తడగొండ నర్సిమ్ బాబు ,హనుమంతు, నరసయ్య, అంజయ్య, బాపురాజు, ఆంజనేయులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
