
"Congress Leaders Pay Tribute on Rajiv Gandhi Birth Anniversary"
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
కొడిమ్యాల (నేటి ధాత్రి ):
కొడిమ్యాల మండల కేంద్రంలో అంగడి బజార్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ అద్వ్యర్యం లో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరి నారాయణ గౌడ్,సీనియర్ నాయకులు గుడి మల్లికార్జునరెడ్డి, గోగూరి మహిపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి వినోద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గడ్డం చంద్రమోహన్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ చిలువరి ప్రసాద్, నాయకులు కిషన్ రెడ్డి, గంగయ్య, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు..