
"Tithi Bhojan Provides Nutritious Meal to School Students"
తిథి భోజన్ ద్వార ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
మండలంలోని కోమటి కొండాపూర్ మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల లో చదువుచున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నభోజనంలో పౌష్టికాహారం అందివ్వడం జరిగింది. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు జ్యోష్ణ తన జన్మదినం సందర్బంగా, తిథి భోజన్ కార్యక్రమం లో భాగంగా 60 మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందివ్వడం పట్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి వారిని అభినందించారు.ఈ సందర్బంగా రాజన్న మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు వారి పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర శుభ దినముల సందర్బంగా వారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, శుచికరమైన భోజనం అందివ్వడం, మరియు సీజనల్ పండ్లు అందివ్వడం ద్వార విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, చిన్నయ్య, రత్నం, ప్రేమ్ కుమార్, సుధారాణి, రాణి, నర్మద, జ్యోష్ణ లు పాల్గొన్నారు.