
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ సేవా కార్యక్రమం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని, నేషనల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబా మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆదేశానుసారం, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కొత్త బస్టాండ్ ప్రాంతంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించబడింది.జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత-నలినీకాంత్ నేతృత్వంలో ఈ కార్యక్రమంలో ఉచితంగా సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగినది. మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ ద్వారా సమకూరిన నిధులతో సానిటరీ నాప్కిన్స్ మిషన్ కొనుగోలు చేసి, మహిళలకు ఉపాధి కల్పిస్తూ, ఉత్పత్తి అయినటువంటి నాప్కిన్లను ఉచితంగా అందజేయడం ఎంతో మంచి కార్యక్రమం అని తెలిపారు .ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి , టౌన్ అధ్యక్షురాలు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప జిల్లా జనరల్ సెక్రటరీ కోడం అరుణ, వైస్ ప్రెసిడెంట్ సామల రోజా, కోడం సుధా, సాగాల లత, మార్గం మంజుల మరియు అనేకమంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.